Fake News, Telugu
 

వీడియోలో దాడికి గురైన వ్యక్తి కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కాదు, పశ్చిమ బెంగాల్ లోని ఒక బీజేపి కార్యకర్త

0

హర్యానా బీజేపి ఎంపి, కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ని ప్రజలు కొడుతున్న దృశ్యాలు, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ని ప్రజలు కొడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి పశ్చిమ బెంగాల్ కి చెందిన ఒక బీజేపి పార్టీ కార్యకర్త. 2016లో పశ్చిమ బెంగాల్ లోని ఆసన్ సోల్ జిల్లాలో జరిగిన ఒక ర్యాలిలో, బీజేపి ఎంపి బాబుల్ సుప్రియో, అతని వెంట వచ్చిన కార్యకర్తలపై త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యలు దాడి చేసారు. ఈ వీడియోకి కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కి ఎటువంటి సంబంధము లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘ABP News’ ఛానల్ ‘19 అక్టోబర్ 2016’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్ లోని ఆసన్ సోల్ జిల్లాలో బీజేపి ఎంపి బాబుల్ సుప్రియో పై త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యలు చేసిన దాడికి సంబంధించిన వీడియో అని వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ ఘర్షణకి సంబంధించిన వివరాల కోసం వెతకగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియో ‘ANI News’ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో దొరికింది. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆసన్ సోల్ జిల్లాలో చేసిన ప్రచార కార్యక్రమంలో త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యలు అతనిపై దాడి చేసారని వివరణలో తెలిపారు. త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యలు బాబుల్ సుప్రియో పై రాళ్లు రువ్వడంతో పాటు అతని వెంట వచ్చిన కార్యకర్తల బట్టలు చించుతూ కొడుతున్న దృశ్యాలు, అని అందులో తెలిపారు.

ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘inKhabar’ న్యూస్ ఛానల్ కూడా యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ లోని ఆసన్ సోల్ జిల్లాలో బీజేపి ఎంపి బాబుల్ సుప్రియో పై జరిగిన దాడికి సంబంధించింది, అని వారు కూడా తెలిపారు. ఈ ఘటనకి సంబంధించి రాసిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియోలో దాడికి గురైన వ్యక్తి కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కాదు, పశ్చిమ బెంగాల్ లోని ఒక బీజేపి కార్యకర్త.

Share.

About Author

Comments are closed.

scroll