Fake News, Telugu
 

హరిద్వార్‌లో ఒక యువతిని చంపి సూట్ కేసులో తీసుకెళ్తూ యువకుడు పట్టుబడ్డ ఘటనలో లవ్ జిహాద్ కోణమేది లేదు

0

హరిద్వార్‌లో హిందూ యువతిని ఒక ముస్లిం యువకుడు ప్రేమించానని వెంటపడి పెళ్ళిచేసుకొన్న తర్వాత చంపి ఇలా సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తుండగా దొరికాడని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హరిద్వార్‌లో హిందూ యువతిని ఒక ముస్లిం చంపి సూట్ కేసులో తీసుకెళ్తుండగా దొరికినప్పడి దృశ్యాలు.

ఫాక్ట్: హరిద్వార్‌లో ఒక హోటల్ లో సూట్ కేస్ నుండి ఒక యువతి మృతదేహం లభించడం వాస్తవమే కానీ, వీడియోలో కనిపిస్తున్న యువతీ యువకుడు ఇద్దరూ ముస్లింలు. హరిద్వార్‌లో ఒక ముస్లిం యువతీ యువకుడు కలిసి పిరాన్ కలియార్ లో కాజోల్ అనే పేరుతో ఒక ఫేక్ ఐడి చూపించి హోటల్ రూమ్ తీసుకున్నారు. పెళ్ళిచేసుకోడానికి అమ్మాయి నిరాకరించినందుకు అబ్బాయి ఆమెను చంపి శవాన్ని సూట్ కేసులో పెట్టుకొని వెళ్తుండగా హోటల్ స్టాఫ్ కి దొరికాడు. తర్వాత పోలీసులు వచ్చి విషయం తెల్సుకుని అబ్బాయి పేరు గుల్జేబ్ హుస్సేన్ అన్సారి, అమ్మాయి పేరు రామ్స అన్సారి అని తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.     

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే దృశ్యాలతో ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. పిరాన్ కలియార్, హరిద్వార్‌లో ఒక హోటల్ లో సూట్ కేస్ నుండి ఒక యువతి మృతదేహం లభించిందని ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఆ యువతిని ఒక యువకుడు హత్య చేసాడని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని యువకుడు అబద్ధం చెప్పాడని, కాజోల్ అనే పేరుతో ఒక ఫేక్ ఐడి చూపించి హోటల్ లో రూమ్ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అబ్బాయి పేరు గుల్జేబ్ అని, అమ్మాయి పేరు రామ్స అని తెలుస్తుంది.

ఇటీవల, హరిద్వార్‌లో ఒక ముస్లిం యువతీ యువకుడు కలిసి పిరాన్ కలియార్ లో హోటల్ రూమ్ తీసుకున్నారు. ఆ అబ్బాయి పేరు గుల్జేబ్ హుస్సేన్ అన్సారి, అమ్మాయి పేరు రామ్స అన్సారి. కొద్దిసేపటి తర్వాత, ఆ అబ్బాయి హోటల్ రూమ్ బయటినుంచి సూట్ కేసుతో వచ్చినప్పుడు కొంతమంది హోటల్ స్టాఫ్ కి అనుమానం వచ్చి సూట్ కేసు తీసి చూసినప్పుడు అమ్మాయి మృతదేహం ఉంది. అయితే, పెళ్ళిచేసుకోడానికి అమ్మాయి నిరాకరించినందుకు అబ్బాయి ఆమెను చంపి ఉంటాడని రిపోర్ట్స్ ఉన్నాయి.

ఇదే విషయం గురించి వివరాలు తెలుసుకోవడానికి ‘ఇండియా టుడే’ సంస్థ పిరాన్ కాలియర్ స్టేషన్ ఆఫీసర్ ధర్మేంద్ర రాతిని సంప్రదించగా “అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరు ముస్లింలు. అబ్బాయి పేరు గుల్జేబ్ హుస్సేన్, అమ్మయి పేరు రామ్స, రషీద్ యొక్క కూతురు.” అని తెలిపారు.

చివరగా, హరిద్వార్‌లో ఒక యువతిని ఒక యువకుడు చంపి సూట్ కేసులో తీసుకెళ్తుండగా దొరికిపోయిన ఘటనలో లవ్ జిహాద్ కోణమేది లేదు.

Share.

About Author

Comments are closed.

scroll