జమ్మూ కాశ్మీర్ లో అనధికారికంగా ప్రవేశించి, కాలనీలు ఏర్పరచుకొన్న రోహింగ్యాల ఇళ్ళను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రోహింగ్యాల అక్రమ నిర్మాణాలను జమ్మూ కాశ్మీర్ అధికారులు కుల్చివేస్తున్న వీడియో.
ఫాక్ట్: ‘జమ్మూ లింక్’ న్యూస్ యు ట్యూబ్ ఛానల్ లో ఒరిజినల్ వీడియో అప్లోడ్ చేసారు. అందులో గానీ, ఈటీవీ భారత్ న్యూస్ ఆర్టికల్ లో గానీ, రోహింగ్యాల గురించి ప్రస్థావన లేదు. అయితే ‘లేక్స్ అండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ అథారిటీ’ వారు దాల్ లేక్ సమీపంలో అక్రమ నిర్మాణాలను కూలగొట్టినవి శ్రీనగర్ లోని ప్రాంతంలోవి, కానీ రోహింగ్యాలు శ్రీనగర్ ప్రాంతంలో ఉన్నట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్ లోని వీడియోను స్క్రీన్ షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు అదే వీడియో యూట్యూబ్ లో జమ్మూ లింక్ న్యూస్ ఛానల్ పేరుమీద అప్లోడ్ చేయబడింది. ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ‘లేక్స్ అండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ అథారిటీ’ వారు అక్రమ నిర్మాణాలను లష్కరి మొహల్లా, డాజి మొహల్లా, బుర్జ్హమా, వాన్గుట్ టిబాల్ మరియు నిశాట్ ప్రాంతాల్లో పడగొట్టారు అని ఉంది. అదే వీడియో ఉన్న మరో యు ట్యూబ్ న్యూస్ వీడియో ఇక్కడ చూడొచ్చు. ఈ రెండు వీడియోల్లో రోహింగ్యాల ప్రస్తావన లేదు.
పైన దొరికిన వీడియోల నుంచి క్లూ తీసుకొని సెర్చ్ చేసినప్పుడు ఈటీవీ భారత్ వారి న్యూస్ ఆర్టికల్ లభించింది. ఈ ఆర్టికల్ లో కూడా కరోన లాక్ డౌన్ ను అలుసుగా తీసుకొని అక్రమ నిర్మాణాలు కడుతున్నారని, అందుకే లేక్స్ అండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ అథారిటీ వారు గ్రీన్ బెల్ట్ మీద ఉన్నవాటిని పడగొడుతున్నారని తెలుస్తుంది. ఈ ఆర్టికల్ లో కూడా రోహింగ్యాల ప్రస్థావన లేదు.
‘లేక్స్ అండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ అథారిటీ’ వారు దాల్ లేక్ చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలను పడగొడుతున్నారని, పోయిన మూడు నెలల్లో 170 కు పైగా అక్రమ నిర్మాణాలను కులగోట్టారని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ‘లేక్స్ అండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ అథారిటీ’ వారు తరచుగా ఇలా అక్రమ కట్టడాలను కూల్చేస్తారని, ఈ మధ్య కరోన లాక్ డౌన్ మూలాన ఇంకా ఇది పెరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి వీడియో లు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
అయితే ‘లేక్స్ అండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ అథారిటీ’ వారు దాల్ లేక్ సమీపంలో అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు, అవి శ్రీనగర్ లోని ప్రాంతాలు. కానీ రోహింగ్యాలు శ్రీనగర్ ప్రాంతంలో ఉన్నట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించలేదు. కానీ, జమ్మూ ప్రాంతంలో రోహింగ్యా శరణార్థులు ఉన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, దాల్ లేక్ సమీపంలో పడగొడుతున్న అక్రమ నిర్మాణాల వీడియోను రోహింగ్యాలకు తప్పుగా ముడిపెడ్తున్నారు.