Fake News, Telugu
 

నరేంద్ర మోదీ మీద ప్రేమతో ఇండోనేషియా అధ్యక్షుడు తన మనవడికి ‘శ్రీ నరేంద్ర’ అనే పేరు పెట్టలేదు

0

నరేంద్ర మోదీ మీద ప్రేమతో ఇండోనేషియా అధినేత తన మనవడికి ‘శ్రీ నరేంద్ర’ అనే పేరు పెట్టుకున్నాడు’, అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నరేంద్ర మోదీ మీద ప్రేమతో ఇండోనేషియా అధినేత తన మనవడికి ‘శ్రీ నరేంద్ర’ అనే పేరు పెట్టుకున్నాడు.

ఫాక్ట్: నరేంద్ర మోదీ మీద ప్రేమతో తన మనవడికి ‘శ్రీ నరేంద్ర’ అనే పేరుని పెట్టినట్టు ఇండోనేషియా అధ్యక్షుడు ఎక్కడా చెప్పలేదు, దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. 2018 లో ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్ లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మాట్లాడుతూ, తన మనవడి పేరు కూడా ‘శ్రీనరేంద్ర’ (పూర్తి పేరు – ‘జన్ ఎతేస్ శ్రీనరేంద్ర’) అని చెప్పాడు. కావున, జోకో విడోడో మనవడి పేరు ‘శ్రీనరేంద్ర’ అనేది వాస్తవమే అయినా, పోస్ట్ లో ఆ పేరు నరేంద్ర మోదీ మీద ప్రేమతో పెట్టినట్టు లేని కథను చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. 2018 లో ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్ లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మాట్లాడుతూ, తన మనవడి పేరు కూడా ‘శ్రీనరేంద్ర’ [పూర్తి పేరు – ‘జన్ ఎతేస్ శ్రీనరేంద్ర’ (‘Jan Ethes Srinarendra’)] అని చెప్పినట్టు తెలిసింది. కానీ, మోదీ మీద ప్రేమతో తన మనవడికి ఆ పేరు పెట్టినట్టు జోకో విడోడో చెప్పాడని ఎక్కడా కూడా ఎవరు రిపోర్ట్ చేయలేదు.

అంతేకాదు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మనవడు ‘జన్ ఎతేస్ శ్రీనరేంద్ర’ 2016 లో పుట్టినప్పుడు, ఆ పేరు అర్థాన్ని జోకో విడోడో కొడుకు మరియు ‘శ్రీనరేంద్ర’ తండ్రి అయిన గిబ్రాన్ తెలిపినట్టు ‘ది జకార్తా పోస్ట్’ రిపోర్ట్ చేసింది. గిబ్రాన్ మాట్లాడుతూ – ‘జన్’ అంటే ‘అత్యంత’ (‘most’), ‘ఎతేస్’ అంటే ‘సామర్థ్యం’ (‘dexterous’), ‘శ్రీనరేంద్ర’ అంటే ‘తెలివైన నాయకుడు’ (‘intelligent leader’), అని చెప్పినట్టు తెలిసింది. ప్రధాని మోదీ మీద ప్రేమతో పెట్టినట్టు తను కూడా ఎక్కడా చెప్పలేదు. ఒక వేళ నిజంగానే 2016 లో మోదీ మీద ప్రేమతో ఇండోనేషియా అధినేత తన మనవడికి ‘శ్రీ నరేంద్ర’ అనే పేరు పెట్టుంటే, అన్నీ మీడియా సంస్థలు ఆ విషయం గురించి అప్పుడే ప్రచురించేవి. కానీ, ఎక్కడా కూడా అలాంటి సమాచారం దొరకలేదు.

చివరగా, నరేంద్ర మోదీ మీద ప్రేమతో ఇండోనేషియా అధ్యక్షుడు తన మనవడికి ‘శ్రీ నరేంద్ర’ అనే పేరు పెట్టలేదు. తన మనవడి పేరు కూడా ‘శ్రీనరేంద్ర’ అని మాత్రం జోకో విడోడో చెప్పాడు.

Share.

About Author

Comments are closed.

scroll