“వీడు ఓ టీచర్ చెత్తనా కొడుకు పిల్లల్ని ఎలా కొడుతున్నాడో చుడండి”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ వీడియో తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది అని చెప్తూ, ఆ వీడియోతో పాటు మరో ఆడియో క్లిప్ కూడా షేర్ అవుతోంది. ఆ ఆడియో క్లిప్‌ని ఇక్కడ వినవచ్చు. ఆ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వీడియోలో పిల్లాడిని ఓ టీచర్ కొడుతున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది.
ఫాక్ట్: వీడియోలో పిల్లాడిని ఓ టీచర్ కొడుతున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. ఆ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగింది. కావున, ఆ ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టు చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అవే దృశ్యాలతో ‘NDTV’ వారు తాజాగా ప్రచురించిన ఒక ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చింది. వీడియోలో ఓ టీచర్ పిల్లాడిని కొడుతున్న ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగినట్టు ఆ అర్టికల్‌లో చదవచ్చు. ఆ ఘటనపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

ఆ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియోలో పిల్లాడిని ఓ టీచర్ కొడుతున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు; బీహార్ రాష్ట్రంలో జరిగింది.