Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతిలో నాలుగో స్థానంలో ఉన్నాడంటూ ది గార్డియన్ ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు

0

ది గార్డియన్ పత్రిక ప్రకారం రాజకీయ నాయకుల కుమారుల అవినీతికి సంబంధించిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ది గార్డియన్ పత్రిక ప్రకారం రాజకీయ నాయకుల కుమారుల అవినీతికి సంబంధించిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఫాక్ట్ (నిజం): రాజకీయ నాయకుల కుమారుల అవినీతికి సంబంధించిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడని చెప్తూ ది గార్డియన్ ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు. ఇదే విషయం మేము వారిని మెయిల్ ద్వారా సంప్రదించిగా ఈ కథనం తాము రాయలేదని స్పష్టం చేసారు. పైగా పోస్టులోని కథనంలో వాడిన ఫాంట్ మరియు లేఔట్ స్టైల్ కి తమ సంస్థ రాసే కథనాలలో వాడే స్టైల్ కి చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది. ఇదే విషయం ది గార్డియన్ రాసిన కథనాలను పోస్టులోని కథనంతో పోల్చినప్పుడు స్పష్టంగా అర్ధమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయానికి సంబంధించి గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులో చెప్తున్నట్టు ది గార్డియన్ పత్రిక జగన్ మోహన్ రెడ్డి అవినీతిపరుడని రాసిన పత్రికా కథనం ఏది మాకు కనిపించలేదు. ఒక వేల గార్డియన్ లాంటి పత్రిక ఈ వార్తని ప్రచురించి ఉంటే భారత మీడియా కూడా ఈ విషయాన్నీ ప్రచురించేది. కాని ఇలాంటి వార్తా కథనం గాని లేదా వీడియో రిపోర్ట్ గాని మాకు లభించలేదు.

ఈ వార్త గురించి స్పష్టత కోసం FACTLY ‘ది గార్డియన్’ ని మెయిల్ ద్వారా సంప్రదించగా, ఈ కథనం తమ సంస్థ రాయలేదని, ఇలాంటి కథనం ఏది తమ వెబ్సైటులో లేదని స్పష్టం చేసారు. పైగా పోస్టులోని కథనం తమ సంస్థ రాసిన కథనంలా లేదని తెలుపుతూ పోస్టులోని కథనం యొక్క ఫాంట్ మరియు లేఔట్ తమ కథనాలకు పూర్తి భినంగా ఉందని అన్నారు. ఉదాహారణకి, పోస్టులోని కథనంలో ‘MohanReddy’ అని రాసి ఉందని, కాని తమ సంస్థ రాసే కథనాలలో ‘Mohan Reddy’ అని రాస్తాం అని తెలిపారు.

2012లో ది గార్డియన్ రాసిన ఒక కథనంలో జగన్ మోహన్ రెడ్డి పేరుని మెయిల్ లో చెప్పినట్టు ‘Mohan Reddy’ అని రాసి ఉండడం గమనించొచ్చు. పైగా రెండు కథనాలను పోల్చినప్పుడు రెండు కథనాలలో ఉన్న ఫాంట్స్ లో కూడా వ్యత్యాసం గమనించొచ్చు. ది గార్డియన్ రాసే కథనాలలో వాడే ఫాంట్స్, పేజీ లేఔట్స్ మరియు ఇతర సమాచరం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతిలో నాలుగో స్థానంలో ఉన్నాడంటూ ది గార్డియన్ ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll