Fake News, Telugu
 

వీడియోలోనిది ‘ఓం’ అనే శబ్దంతో సహజసిద్ధంగా జరిగే వింత కాదు; వివిధ శబ్దాల ద్వారా పని చేసే ఒక ఫౌంటెన్

0

రెండు కొండల మధ్య ఉన్న ఓ సహజనది థాయిలాండ్ లో ఉందని, అక్కడ ‘ఓం’ అనే శబ్దం ఎంత గట్టిగా ఉచ్చరిస్తే అంత పైకి నీరు ఫౌంటెన్ లా కొండలకంటే పైకి వస్తున్నాయని, ‘ఓం’ కి తప్ప మరి ఏ పదానికి అలా జరగదని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  ‘ఓం’ అని ఎంత గట్టిగా ఉచ్ఛరిస్తే అంత పైకి థాయిలాండ్ లోని ఓ సహజనది నీరు ఫౌంటెన్ లా కొండలకంటే పైకి వస్తున్న వీడియో. ‘ఓం’ కి తప్ప మరి ఏ పదానికి అలా జరగదు.

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో చైనా కి సంబంధించింది; థాయిలాండ్ కి సంబంధించింది కాదు. అది శబ్దాల ద్వారా పని చేసే ఒక ఫౌంటెన్; సహజసిద్ధంగా జరిగే వింత కాదు. అంతేకాదు, కేవలం ‘ఓం’ అనే శబ్దంతో అది పనిచేస్తుందని ఎక్కడా లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని ఒకరు యూట్యూబ్ లో ‘వాయిస్ నియంత్రిత వాటర్ ఫౌంటెన్ ఉత్తర చైనా’ (తెలుగు అనువాదం) అనే టైటిల్ పెట్టినట్టు తెలిసింది. కొన్ని కీ-వర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతకగా, ‘Xinhua Culture&Travel’ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా అలాంటి వీడియోనే ఒకటి పెట్టి, ఆ వీడియో చైనా (కాంగ్‌షన్ పర్వతాలు) కి సంబంధించినట్టు పేర్కొన్నారు. కాబట్టి, పోస్ట్ లోని వీడియో థాయిలాండ్ దేశానికి సంబంధించింది కాదు.

అది శబ్దాల ద్వారా పని చేసే ఒక ఫౌంటెన్; సహజసిద్ధంగా జరిగే వింత కాదు. అంతేకాదు, కేవలం ‘ఓం’ అనే శబ్దంతో అది పనిచేస్తుందని ఎక్కడా లేదు. వివిధ శబ్దాల తో అరిచే స్థాయి బట్టి అదే విధంగా పని చేసే వివిధ ఫౌంటెన్ల వీడియోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. పోస్ట్ లోని వీడియోలో ఉన్న అమ్మాయి కూడా ‘ఆ…….’ అని అరిచినట్టు గమనించవొచ్చు; ‘ఓం’ అని కాదు.

చివరగా, వీడియోలోనిది ‘ఓం’ అనే శబ్దంతో సహసిద్ధంగా జరిగే వింత కాదు; వివిధ శబ్దాల ద్వారా పని చేసే ఒక ఫౌంటెన్.

Share.

About Author

Comments are closed.

scroll