Fake News, Telugu
 

ఆదిపురుష్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదని చిత్ర బృందం ఎక్కడా ప్రకటించలేదు, ప్రచారంలో ఉన్న పోస్టర్ నకిలీది

0

జూన్ 16న విడుదలవబోతున్న ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదని చెప్తూ ఆ చిత్ర బృందం ప్రకటించినట్లు ఒక పోస్టర్ యొక్క ఫోటో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదని చెప్తూ ఆ చిత్ర బృందం ప్రకటించింది.

ఫాక్ట్: ఆదిపురుష్ చిత్రబృందం ఎక్కడా ఇటువంటి ప్రకటన చేయలేదు. ఇది ఎడిట్ చేయబడిన పోస్టర్. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఆదిపురుష్ చిత్ర బృందం ఇటువంటి ప్రకటన ఏమైనా చేసిందా అని చిత్ర బృందానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఎక్కడా కూడా ఇటువంటి ప్రకటన చేసినట్లు ఆధారాలు లభించలేదు. ఈ విషయానికి సంబంధించి మీడియాలో కూడా ఎటువంటి కథనాలు రాలేదు.

ఇక వైరల్ అవుతున్న పోస్టర్ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 05 జూన్ 2023న విడుదల చేసిన ఇదే డిజైన్‌తో ఉన్న మరొక పోస్టర్ లభించింది. ఆదిపురుష్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో హనుమంతుడి గౌరవార్ధం ఒక సీటును విక్రయించకుండా ఖాళీగా ఉంచబడుతుందని చిత్ర బృందం నిర్ణయించినట్లు ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని 06 జూన్ 2023న తిరుపతిలో జరిగిన ప్రీ- రిలీజ్ ఫంక్షన్లో నటుడు ప్రభాస్ మరియు సినిమా నిర్మాతలు స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న ఈ పోస్టర్‌ను గమనించగా, అసలు పోస్టర్‌లోని అక్షరాలని చెరిపివేసి ఇలా తప్పుడు సమాచారంతో ఎడిట్ చేసినట్లుగా స్పష్టంగా చూడవచ్చు. పైగా, కులం,మతం, ప్రాంతం వంటివాటి ఆధారంగా పౌరులపై వివక్ష చూపడం అనేది భారత దేశంలో చట్టరీత్యా నేరం.

చివరిగా, పై ఆధారాలను బట్టి దళితులకు ఆదిపురుష్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదని చెప్తున్న ఈ పోస్టర్ నకిలీదని, చిత్రబృందం ఎక్కడా ఇటువంటి ప్రకటన చేయలేదని ధృవీకరించవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll