Fake News, Telugu
 

నరేంద్ర మోదీ మూడు నెలల క్రితం ప్రారంభించినట్టు చూపిస్తున్న జామ్ నగర్ – జునాగర్ హైవే బ్రిడ్జ్ చాలా సంవత్సరాల క్రితం కట్టింది

0

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసి, ప్రధానమంత్రిగా ప్రారంభించిన జామ్ నగర్ -జునాగర్ హైవే యొక్క బ్రిడ్జి మూడు నెలల్లోనే కూలిపోయింది, అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కూలిపోయిన జమ్నగర్-జునాగర్ హైవే బ్రిడ్జి మూడు నెలల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఫాక్ట్ (నిజం): జామ్ నగర్ -జునాగర్ హైవే బ్రిడ్జి రాజ్ కోట్ జిల్లాలోని జంకండోర్న అనే గ్రామంలో కూలిపోయింది. జంకండోర్న గ్రామంలో కూలిపోయిన ఈ బ్రిడ్జి 2009 కన్నా ముందు నుంచే వినియోగంలో ఉంది. దీనిబట్టి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందే బ్రిడ్జి ప్రారంభించినట్లు ఖచ్చితంగా చెప్పవచ్చు. కావున ఈ పోస్ట్ ద్వారా చెప్తున్నది తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘Desh Gujarat’ అనే న్యూస్ పోర్టల్ వారు రాసిన ఒక ఆర్టికల్ లో కూలిపోయిన ఆ బ్రిడ్జ్ కి సంబంధించిన వివరాలు దొరికాయి. జంకండోర్న గ్రామం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాటుదాద్ గ్రామం పై నుంచి వెళ్తున్న జామ్ నగర్ -జునాగర్ హైవే బ్రిడ్జ్ కూలిపొయినట్టు ఆ ఆర్టికల్ లో రాసారు. జూన్ 2019లో ఈ బ్రిడ్జ్ కూలినట్టు ఆ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే విషయానికి సంబంధించి ‘Sandesh’ అనే న్యూస్ ఏజెన్సీ వారు రాసిన ఆర్టికల్ లో కూడా ఆ బ్రిడ్జ్ కట్టి చాలా సంవత్సరాలు అయినట్టు రాసి ఉంది. ఈ రెండు ఆర్టికల్స్ లో ఆ బ్రిడ్జి ఇటీవల కట్టింది కాదు అని తెలిసినప్పటికీ, ఎప్పుడు ఆ బ్రిడ్జి ప్రారంభించారు అనే విషయం పై స్పష్టత రాలేదు.

పై ఆర్టికల్స్ లో దొరికిన వివరాల ఆధారాలతో కూలిపోయిన ఆ బ్రిడ్జి స్థానాన్ని ‘Google Earth’ లో కనుగొన్నాము. ఆ ఉపగ్రహ చిత్రంలోని వివరణ ఆధారంగా కూలిపోయిన ఆ బ్రిడ్జి 2009 కన్నా ముందు నుంచే వినియోగంలో ఉన్నట్టు తెలిసింది. దీని బట్టి ఆ బ్రిడ్జి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. Google Earth లో దొరికిన ఆ ఉపగ్రహ చిత్రం యొక్క స్క్రీన్ షాట్ కింద చూడవచ్చు.

జామ్ నగర్ -జునాగర్ హైవే బ్రిడ్జి కూలిపోయిన సమయానికి రాజ్ కోట్ కలెక్టర్ గా విధుల్లో ఉన్న రాహుల్ గుప్త, Times of India కరెస్పాండంట్ తో మాట్లాడుతూ ‘45 సంవత్సరాల ముందు ఈ బ్రిడ్జి state roads and building డిపార్టుమెంటు వారు కట్టి, తరువాత ‘National Highways Authority of India’ వారికి అప్పగించారు’ అని తెలిపారు. అలాగే, ఈ బ్రిడ్జ్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినట్టు చేస్తున్న వార్తల్లో నిజం లేదు అని స్పష్టం చేసారు. ఆ బ్రిడ్జి చాలా రోజులనుండి శిథిలావస్థలో ఉన్నట్టు రాహుల్ గుప్త తెలిపారు.

చివరగా, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రారంభించారు అని చూపిస్తున్న ఆ బ్రిడ్జ్ చాలా సంవత్సరాల క్రితం కట్టింది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll