Fake News, Telugu
 

బిజేపి నాయకుడు వికాస్ దూబే ను, కాన్పూర్ ఎన్కౌంటర్ సూత్రధారి అయిన వికాస్ దూబే గా చిత్రికరిస్తున్నారు

0

‘2 జులై 2020’ నాడు కాన్పూర్ లో జరిగిన ఒక ఎన్కౌంటర్ లో ఒక డి.ఎస్.పి. , ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీస్ అధికారుల మరణించారు. బిజేపి నాయకుడు వికాస్ దూబే యొక్క పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తు, కాన్పూర్ ఎన్కౌంటర్ కి సంబంధించి కీలక సూత్రధారి, అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాన్పూర్ ఎన్కౌంటర్ సూత్రధారి బిజేపి నాయకుడు వికాస్ దుబే.

ఫాక్ట్ (నిజం): వికాస్ దూబే అనే అదే పేరు కలిగి ఉన్న కాన్పూర్ లోని ఒక రౌడీ ఈ ఎన్కౌంటర్ కి కీలక సూత్రధారి, బిజేపి నాయకుడు వికాస్ దూబే కాదు. కాన్పూర్ ఎన్కౌంటర్ కి సంబంధించి తనని నిందితుడుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నేపధ్యంలో బిజేపి నాయకుడు వికాస్ దూబే, తనకి ఈ ఎన్కౌంటర్ కి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తూ వీడియో రిలీజ్ చేసారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

‘02 జులై 2020’  నాడు కాన్పూర్ లో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించిన వివరాల కోసం వెతకగా, ‘jagran’ వెబ్సైటులో ఈ విషయానికి సంబంధించి రాసిన ఒక ఆర్టికల్ దొరికింది. ఈ ఎన్కౌంటర్ కి ప్రధాన సూత్రధారి అయన వికాస్ దూబే ఫోటో ఆ ఆర్టికల్ లో దొరికింది. దాన్ని బట్టి ఈ ఎన్కౌంటర్ కి బిజేపి నాయకుడు వికాస్ దూబేకి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టమయ్యింది . వికాస్ దూబే అనే అదే పేరు గల కాన్పూర్ లోని ఒక రౌడీ షీటర్ ఈ ఎన్కౌంటర్ లో ప్రధాన నింధితుడని విశ్లేషణలో తెలిసింది. 60కి పైగా కేసులలో నిందితుడుగా గా ఉన్న ఈ రౌడీ షీటర్, ఇదివరకు  బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లో సభ్యుడుగా ఉన్నాడని వార్తా పత్రికలు రిపోర్ట్ చేసాయి.

కాన్పూర్ ఎన్కౌంటర్ కి సంబంధించి తనని నిందితుడుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నేపధ్యంలో బిజేపి నాయకుడు వికాస్ దూబే, తనకి ఈ ఎన్కౌంటర్ కి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తూ ట్విట్టర్ లో వీడియో రిలీజ్ చేసారు. బిజేపి నాయకుడు వికాస్ దూబే  ఇచ్చిన ఈ స్పష్టికరణకి సంబంధించి రాసిన ఆర్టికల్ మనం ఇక్కడ చూడవచ్చు.

 ’02 జులై 2020’ నాడు, 15 నుండి 16 మందితో కూడిన పోలీస్ బృందం వికాస్ దూబేను పట్టుకోవడానికి కాన్పూర్ లోని చౌబెపూర్ గ్రామంలోకి అర్దరాత్రి రైడ్ కి వెళ్ళడం జరిగింది. ఈ విషయం ముందే తెలుసుకున్న దూబే , పోలీసులు అక్కడికి చెరుకోగానే ఒకసారిగా తన మనుషులతో దాడి చేసాడు. ఈ దాడిలో ఒక  డి.ఎస్.పి. , ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీస్ అధికారుల మరణించారు.

చివరగా,  బిజేపి నాయకుడు వికాస్ దూబే ను, కాన్పూర్ ఎన్కౌంటర్ సూత్రధారి అయిన వికాస్ దూబే గా తప్పుగా చిత్రికరిస్తున్నారు

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll