Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపించే పక్షి పేరు ‘లైర్ బర్డ్’. ఆ వీడియోను ఆస్ట్రేలియా లోని అడిలైడ్ జూలో తీశారు

0

ఒక పక్షి వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అది తమిళనాడులో కనిపిస్తుందని, దానిని  ప్రపంచ వారసత్వంగా పరిగణిస్తారని,  దాని ధర 25 లక్షల రూపాయలని, అంతేకాక, ఆ వీడియోను తీయడానికి 16 ఫొటోగ్రఫర్లకి  62 రోజులు పట్టిందని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రపంచ వారసత్వంగా పరిగణించే ఈ పక్షి తమిళనాడులో కనిపిస్తుంది. ఈ వీడియోను తీయడానికి 16 ఫొటోగ్రఫర్లకి 62 రోజులు పట్టింది.

ఫాక్ట్ (నిజం): ఆ వీడియోలో పక్షి పేరు ‘లైర్ బర్డ్’, అది ఆస్ట్రేలియాలో స్థానికంగా కనిపించే పక్షి. ఆ వీడియో ను ‘Four Fingers Photography’ వారు ఆస్ట్రేలియా లోని అడిలైడ్ జూలో తీశారు. పోస్టులో చెప్పినట్టు ఆ వీడియో తీయడానికి 16 ఫొటోగ్రఫర్లకి 62 రోజులు పట్టలేదు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.

పోస్ట్ చేసిన వీడియోని ‘Yandex’ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే రష్యన్ టైటిల్ తో ఉన్న అదే వీడియో కనిపించింది. ఆ వీడియో పైన ఉన్న శీర్షికను ఇంగ్లీష్ భాషలోకి అనువాదించి చూస్తే ‘LyreBird – A ParodyBird’ అని ఉంది. యూట్యూబ్ లో ‘Lyre Bird’ అనే కీ వర్డ్ ఉపయోగించి ఎవరైనా దానికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశారేమో అని చూస్తే ‘Four Finger’ అనే యూసర్ కొంచెం ఎక్కువ నిడివి తో ఉన్న అలాంటి వీడియోని అప్లోడ్ చేయడం కనిపించింది. ఆ వీడియో కింద వారు ఇచ్చిన వివరణ బట్టి, ఆ పక్షి ‘లైర్ బర్డ్’ అని, ఆ వీడియో ను ఆస్ట్రేలియా లోని అడిలైడ్ జూలో తీసారని తెలిసింది. అదే వివరణలో లైర్ బర్డ్ అనే పక్షి ఆస్ట్రేలియా లో కనిపిస్తుందని, అవి వాటి చుట్టుపక్కల నుండి వచ్చే ఏ శబ్దాలనైనా  అనుకరిస్తాయి అని ఉంది. అంతేకాక,ఆ పక్షుల్లో మగ జాతి పక్షులకి ఆకర్షణీయమైన పెద్ద తోక ఉంటుందని తెలిసింది.  ‘Four Finger Photography’ వారి ఫేస్బుక్ పేజీలో కూడా ఈ పక్షికి సంబందించిన వీడియో మరియు ఫోటోలు చూడవొచ్చు.

అదే వీడియోని ‘ABC Adelaide‘ కూడా ‘Lyre bird in Adelaide Zoo incredible mimics’ అనే శీర్షిక తో పోస్ట్ చేసి ‘Four Finger Photography’ కి  వీడియో క్రెడిట్ ఇవ్వడం చూడవచ్చు.

ఇదే వివరాలతో ‘The Indian Express’ మరియు ‘News18′ మీడియా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చదవవొచ్చు.

చివరగా, పైన పోస్ట్ చేసిన పక్షి పేరు ‘లైర్ బర్డ్’, ఆ వీడియో ను ఆస్ట్రేలియా లోని అడిలైడ్ జూ లోతీశారు. ఆ వీడియో తీయడానికి 16 ఫొటోగ్రఫర్లకి 62 రోజులు పట్టలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll