Fake News, Telugu
 

ఫాస్ట్‌ట్యాగ్‌ వల్ల రోజుకి 17 కోట్ల టోల్ కలెక్షన్స్ పెరగలేదు

0

‘టోల్ వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌ తప్పనిసరి చేసిన తరువాత రోజుకు వసూళ్లు సరాసరి 17 కోట్లు పెరిగాయని, ఇంతకు ముందు ఈ డబ్బుని ఒక స్కాం ద్వారా దోచుకున్న విధానాన్ని వివరిస్తూ, ఈ స్కాంని ఆపాటానికే ప్రస్తుత టోల్ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా పోస్టు  ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా టోల్ కలెక్షన్స్ గణనీయంగా పెరిగాయి.

ఫాక్ట్(నిజం): 2012-13 సంవత్సరానికి నేషనల్ హైవేల పై టోల్ రూపంలో రూ. 9514.33 కోట్లు వసూలయ్యాయి. ఐతే 2013-14లో 23.28% పెరిగి 11729.27 కోట్లకు చేరుకుంది. 2012-18 వరకి కేవలం 2016-17 తప్పిస్తే మిగతా సంవత్సరాలలో టోల్ కలెక్షన్ ఇంచు మించు ఒకే రేట్ లో పెరుగుతు వస్తున్నాయి. NPCI ప్రకారం ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా టోల్ కలెక్షన్ 2017-18తో పోలిస్తే 71.83% పెరిగి 5760.45 కోట్ల చేరుకోగా, 2019-20లో ఇది 11294.49 కోట్లకు చేరుకుంది, 2018-19తో పోలిస్తే 96.06% పెరిగింది. దీన్ని బట్టి ఇంతకుముందు టోల్ ప్లాజాలో డబ్బులిచ్చి టోల్ కట్టే వారు ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా టోల్ కడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రతీ నెలా ఇష్యూ అవుతున్న  ఫాస్ట్‌ట్యాగ్‌లు మరియు ప్రతీ నెల పెరుగుతున్న ఫాస్ట్‌ట్యాగ్‌ లావాదేవీల సంఖ్య ద్వారా కూడా ఇదే విషయం అర్థమవుతుంది కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా 25 ఫిబ్రవరి 2021న టోల్ వసూలు రికార్డు స్థాయిలో 103.94 కోట్ల రూపాయలకు చేరుకుందని నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా (NHAI) ఇటీవల ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCI) ప్రకారం జనవరి 2021 నెలలో 14.856 కోట్ల లావాదేవీలతో మొత్తం 2397.84 కోట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా టోల్ వసూలైంది. దీన్నిబట్టి రోజువారి సగటును లెక్కిస్తే రోజుకి సుమారు రూ. 77.35 కోట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా టోల్ వసూలైందని తెలుసుకోవొచ్చు.

ఐతే కేవలం ఫాస్ట్‌ట్యాగ్‌ వల్ల టోల్ కలెక్షన్స్ పెరిగాయని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే 2016-17 (ఏప్రిల్ 2016-మార్చ్ 2017) కాలంలో నేషనల్ హైవేల పై టోల్ రూపంలో రూ. 18893.27 కోట్లు వసూలైంది, 2017-18లో టోల్ రూపంలో రూ. 22820.58 కోట్లు వసూలు అయ్యింది. ఐతే NPCI ప్రకారం 2017-18లో ఫాస్టాగ్ ద్వారా వసూలైన టోల్ విలువ రూ. 3352.4 కోట్లు మాత్రమే. అంటే ఆ సంవత్సరం వసూలైన మొత్తం టోల్ లో ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా వసూలైంది కేవలం 14.68% మాత్రమే. 

కాని 2018-19లో ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా టోల్ కలెక్షన్ 2017-18తో పోలిస్తే 71.83% పెరిగి 5760.45 కోట్ల చేరుకోగా, 2019-20లో ఇది 11294.49 కోట్లకు చేరుకుంది. 2018-19తో పోలిస్తే 96.06% పెరిగింది. దీన్ని బట్టి ఇంతకుముందు టోల్ ప్లాజాలో డబ్బులిచ్చి టోల్ కట్టే వారు ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా టోల్ కడుతున్నారని అర్డంచేసుకోవచ్చు. NPCI లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రతీ నెలా ఇష్యూ అవుతున్న ఫాస్ట్‌ట్యాగ్‌లు మరియు ప్రతీ నెల పెరుగుతున్న ఫాస్ట్‌ట్యాగ్‌ లావాదేవీలు సంఖ్య ద్వారా కూడా ఇదే విషయం అర్థమవుతుంది.

2012-13 సంవత్సరానికి నేషనల్ హైవేల పై టోల్ రూపంలో రూ. 9514.33 కోట్లు వసూలయ్యాయి. ఐతే 2013-14లో 23.28% పెరిగి 11729.27 కోట్లకు చేరుకుంది. 2012-18 వరకి కేవలం 2016-17 తప్పిస్తే మిగతా సంవత్సరాలలో టోల్ కలెక్షన్ ఇంచు మించు ఇదే రేట్ లో పెరుగుతూ వచ్చింది. దీన్నిబట్టి కూడా టోల్ కలెక్షన్స్ ప్రతీ సంవత్సరం సాధారణంగా ఆర్థిక వ్యవస్థ, GDP ఎలా అయితే పెరుగుతుందో, అదే విధంగా టోల్ కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయని అర్థమవుతుంది. ఐతే 2012తో పోలిస్తే 2018లో టోల్ కలెక్షన్స్ గణనీయంగా పెరగడానికి టోల్ ప్లజాలు పెరగడం, టోల్ రేట్లు పెరగడం, టోల్ కట్టే వాహనాలు పెరగడం వంటి కారణాలు ఉండొచ్చు.

చివరగా, కేవలం ఫాస్ట్‌ట్యాగ్‌ల వల్ల రోజుకి 17 కోట్ల టోల్ కలెక్షన్స్ పెరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll