Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఆందోళన వీడియోని తెలంగాణా హాస్పిటల్ దుఃస్థితి అని షేర్ చేస్తున్నారు

0

ఒక హాస్పిటల్ నర్సులు అందోళనకి దిగడానికి సంబంధించిన వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ ఘటన తెలంగాణా రాష్ట్రం లోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిందని చెప్తున్నారు. అదే వీడియోని (ఆర్చివ్డ్) కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లో ఉన్న పరిస్థితి అని కూడా షేర్ చేస్తున్నారు. ఆ వీడియో లో ఒక నర్సు పేషెంట్స్ కి చికిత్స చేయడానికి హాస్పిటల్ లో తమకు సరిపడా పీపీఈ కిట్లు, గ్లోవ్స్ , మాస్కులు లేవని ఇంకా హాస్పిటల్ లో కావలసినంత సిబ్బంది కూడా లేరని చెప్తుంది. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణా లోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ దుఃస్థితిని వివరిస్తున్న నర్సు వీడియో

ఫాక్ట్ (నిజం): నర్సుల ఆందోళనకి సంబంధించిన ఈ వీడియో తెలంగాణా రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన ఘటనది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వీడియో లోని ఘటన ఆధారంగా యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ‘ETV Andhra Pradesh’ వారి న్యూస్ వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. ఆ న్యూస్ వీడియో ద్వారా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ లో సరైన సదుపాయాలు లేకపోవడంతో నర్సులు మరియు వైద్య సిబ్బంది హాస్పిటల్ బయట ఆందోళన చేసినట్లుగా తెలిసింది. అదే విషయాన్ని ‘HMTV News’ ప్రసారం చేసిన న్యూస్ వీడియో ద్వారా కూడా తెలుసుకోవాచ్చు.

తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ నర్సుల ఆందోళనకి సంబంధించిన మరికొన్ని న్యూస్ రిపోర్ట్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ లో నర్సుల ఆందోళన వీడియోని పోస్టు చేసి తెలంగాణా లోని హాస్పిటల్ దుఃస్థితి అని చెప్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll