గతంలో ఆధార్ కార్డ్‌ని స్కీములకు లింక్ చేయకూడదంటూ కోర్టుకెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీసు పొందాలంటే ఆధార్ కావలంటుందన్న వాదన ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న నేపథ్యంలో ఈ వాదన షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వాదనకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: గతంలో ఆధార్ కార్డ్‌ని స్కీములకు లింక్ చేయకుదంటూ కోర్టుకెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు ఫ్రీ బస్ ప్రయాణం కోసం ఆధార్ కావలంటుంది.
ఫాక్ట్(నిజం): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణానికి ఆధార్ తప్పనిసరి చేయలేదు. ఉచిత బస్ ప్రయాణం చేయడానికి ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సిన నిబంధనను ప్రభుత్వం ఈ పథకానికి ఆధార్‌తో లింక్ చేసిందని తప్పుగా అర్ధం చేసుకొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సర్వీసును ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ ఉచిత సర్వీసుకు ఆధార్‌ను లింక్/కచ్చితం చేస్తుందంటూ వార్తలను షేర్ చేస్తున్నారు.
ఐతే తెలంగాణలో అందించే ఉచిత బస్ ప్రయాణానికి ఆధార్ తప్పనిసరి కాదు. ప్రభుత్వం ఈ పథకానికి ఆధార్‌తో లింక్ చేస్తామని కూడా చెప్పలేదు. ఈ పథకం కేవలం తెలంగాణ స్థానికులకే అందిస్తుండడంతో వారిని గుర్తించడానికి, ఉచిత ప్రయాణం పొందాలనుకున్న వారు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని తెలిపింది. ఇదే విషయాన్నీ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కూడా ట్వీట్ చేసారు.
మధ్యాహ్న భోజన పథకానికి, వోటర్ ఐడీకు ఆధార్‌తో లింక్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి, కోర్టుకు కూడా వెళ్ళిన విషయం నిజమే అయినప్పటికీ, ప్రస్తుతం కాంగ్రెస్ అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణం ఆధార్‌తో లింక్ చేసే ప్రయత్నమేది కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. ఉచిత బస్ ప్రయాణం చేయడానికి ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సిన నిబంధనను తప్పుగా అర్ధం చేసుకొని ప్రభుత్వం ఈ పథకానికి ఆధార్‌తో లింక్ చేసిందని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
చివరగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణం కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయలేదు.