Fake News, Telugu
 

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు

0

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ‘ఈ దేశానికి చంద్రబాబు నాయకత్వం కావాలి’ అని వ్యాఖ్యానించాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘ఈ దేశానికి చంద్రబాబు నాయకత్వం కావాలి’ – తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.

ఫాక్ట్(నిజం): ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించి ఉంటే ,మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి కథనాలేవి లభించలేదు. మార్చ్ 2018లో జరిగిన డీఎంకే మీటింగ్‌లో ‘రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం కాలరాస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని నిలదీస్తున్నాడంటూ’ చంద్రబాబుని ఉద్దేశించి స్టాలిన్ వ్యాఖ్యానించాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ మధ్యకాలంలో చంద్రబాబుని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి కథనాలేవి లభించలేదు.

ఐతే మార్చ్ 2018లో జరిగిన డీఎంకే మీటింగ్‌లో ‘రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం కాలరాస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని నిలదీస్తున్నాడంటూ’ చంద్రబాబుని ఉద్దేశించి స్టాలిన్ వ్యాఖ్యానించినట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి.

తిరిగి నవంబర్ 2018లో లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే క్రమంలో చంద్రబాబు నాయడు స్టాలిన్‌ను కలిసినప్పుడు స్టాలిన్, చంద్రబాబుకి మద్దతు తెలిపాడు. ఐతే ఆ సందర్భంలో స్టాలిన్ మాట్లాడుతూ ‘రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుందని, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలంతా చేతులు కలపాలి, నాయకులందరూ కలిసి పనిచేయాలని’ అన్నారు. ఐతే చంద్రబాబును ఉద్దేశించి పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు మాత్రం స్టాలిన్ చేయలేదు.

చివరగా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll