Fake News, Telugu
 

మధ్యప్రదేశ్ లో అనుమానాస్పద రీతిలో చనిపోయిన అమ్మాయి ఫోటో పెట్టి, ఢిల్లీ అల్లర్లలో రేప్ చేసి చంపేశారని షేర్ చేస్తున్నారు

0

ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఫోటోలోని అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి, ముక్కముక్కలు చేసి, మురికి కాలువలో ముస్లింలు పడేసారని చెప్తూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఫోటోలోని అమ్మాయిని ఢిల్లీ అల్లర్లలో అత్యాచారం చేసి, ముక్కముక్కలు చేసి, మురికి కాలువలో పడేసారు.

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని అమ్మాయి ఫిబ్రవరి 19న మధ్యప్రదేశ్ లోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఇంట్లో నిప్పు అంటుకోవడం వల్ల లేదా తను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని ముందు అనుకున్నా, తనని రేప్ చేసి చంపేసుంటారని తన కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఫోటోలోని అమ్మాయికి, ఢిల్లీ లో జరిగిన అల్లర్లకు అసలు సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

పోస్టులో ఇచ్చిన అమ్మాయి పేరుతో గూగుల్ లో వెతకగా, అదే ఫోటోతో ఉన్న ‘దైనిక్ జాగరణ్’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఫోటోలోని అమ్మాయి మధ్యప్రదేశ్ లోని పరాసులియకాలన్ గ్రామంలో ఫిబ్రవరి 19న తన నివాసంలో అనుమాస్పద రీతిలో చనిపోయిన పన్నెండో తరగతి విద్యార్థి జ్యోతి పాటిదార్ అని తెలుస్తుంది. ఇంట్లో నిప్పు అంటుకోవడం వల్ల లేదా తను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని ముందు అనుకున్నా, తనని రేప్ చేసి చంపేసుంటారని తన కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారని ఆర్టికల్ లో చదవొచ్చు. ఆ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

కేసును తొందరగా దర్యాప్తు చేసి, నిందితులను అరెస్ట్ చేయమని పోలీసులను కోరుతూ ప్రజలు నిర్వహించిన నిరసన రాలీ మరియు ఇతర వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కేసుపై పోలీసులకి ఏబీవీపీ ఇచ్చిన వినతి పత్రాన్ని ఫేస్బుక్ లో ఒకరు పోస్ట్ చేసారు, దాన్ని ఇక్కడ చూడవొచ్చు

ఈ కేసుపై పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ వీడియోని ఇక్కడ చూడవొచ్చు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

చివరగా, మధ్యప్రదేశ్ లో అనుమానాస్పద రీతిలో చనిపోయిన అమ్మాయి ఫోటో పెట్టి, ఢిల్లీ అల్లర్లలో రేప్ చేసి చంపేశారని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll