Fake News, Telugu
 

ఉత్తర ప్రదేశ్ కరోన నియంత్రణ చర్యలని ప్రశంసిస్తూ ‘TIME’ మ్యాగజైన్లో ప్రచురించింది ఒక ప్రకటన

0

భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం కరోన నియంత్రించడానికి తీసుకున్న చర్యలని ప్రశంసిస్తూ ‘TIME’ మ్యాగజైన్ మూడు పేజీల ఆర్టికల్ రాసిందంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. పోస్టులో షేర్ చేసిన ‘TIME’ మ్యాగజైన్ ఆర్టికల్ యొక్క అవే ఫోటోలని కొంతమంది ప్రముఖులు ఇదే క్లెయిమ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం కరోన నియంత్రించడానికి తీసుకున్న చర్యలని ప్రశంసిస్తూ ‘TIME’ మ్యాగజైన్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

ఫాక్ట్ (నిజం): ‘TIME’ మ్యాగజైన్ ప్రచురించిన ఈ ఆర్టికల్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పాన్సర్ (ప్రాయోజిత) చేసినది. ‘TIME’ సంస్థ వారు సొంతంగా రాసి, ప్రచురించే ఆర్టికల్స్ కీ, ఈ ఆర్టికల్ కి చాలా తేడాలు ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, ఆ  ఆర్టికల్ ఒక ‘sponsored content’ (ప్రాయోజిత కంటెంట్) అని ‘TIME’ మ్యాగజైన్ వారు ‘The Quint’ వారికి తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

‘TIME’ మ్యాగజైన్ (డిసెంబర్ 21/ డిసెంబర్ 28, 2020) ఇండియాలో వచ్చిన ఇష్యూ ని FACTLY తీసుకొని కంటెంట్స్ పేజీ చూడగా, ఫోటోలో ఉన్న ఆర్టికల్ టైటిల్ కంటెంట్ లిస్టులో లేదని తెలుస్తుంది. ఒకవేల ‘TIME’ సంస్థ వారు నిజంగా ఆ ఆర్టికల్ సొంతంగా రాసి, ప్రచురిస్తే కంటెంట్స్ పేజీలో ఆ ఆర్టికల్ టైటిల్ ఉండేది. అంతేకాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ లో ఈ ఆర్టికల్ రాలేదు. 

పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్ ఫోటోల పై ‘CONTENT FROM UTTAR PRADESH’ అనే గమనిక రాసి ఉన్నట్టు కూడా చూడవచ్చు. అంటే, అది ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చిన కంటెంట్ అని అర్ధం.

‘TIME’ సంస్థ వారు సొంతంగా రాసి, ప్రచురించిన ఆర్టికల్ లో ఫాంట్స్ మరియు ఉత్తర ప్రదేశ్ కి సంబంధించి ఇచ్చిన ప్రకటన లో ఉన్న ఫాంట్స్ వేరేలా ఉన్నట్టు గమనించవొచ్చు. అదే మ్యాగజైన్ లో ఎల్ఐసీ వారు ఇచ్చిన ప్రకటన లో ఫాంట్స్ కూడా ‘TIME’ సంస్థ వారి సొంత ఆర్టికల్స్ కి భిన్నంగా ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, ప్రకటనలు ఉన్న పేజీల్లో పేజీ నెంబర్లు కూడా లేనట్టు గమనించవొచ్చు.

‘TIME’ మ్యాగజైన్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ కి సంబంధించి, ‘Newslaundary’ న్యూస్ వెబ్ సైట్ ‘06 జనవరి 2021’ నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ‘TIME’ మ్యాగజైన్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ లోని అదే సమాచారాన్ని కొన్ని దేశీయ న్యూస్ వెబ్ సైట్స్ డిసెంబర్ మొదటి వారంలోనే రిపోర్ట్ చేసినట్టు తెలిపారు. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ ఆర్టికల్ ఒక ‘sponsored content’ (ప్రాయోజిత కంటెంట్) అని ‘TIME’ మ్యాగజైన్ సంస్థ తమకు ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్టు ‘The Quint’ వారి ఆర్టికల్ లో చూడవొచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆర్టికల్ కి సంబంధించి స్పష్టత కొరకు ‘TIME’ సంస్థకి ‘FACTLY’ కూడా ఈ-మెయిల్ చేసింది. వారి నుండి సమాధానం వస్తే, ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం కరోన నియంత్రించడానికి తీసుకున్న చర్యలని ప్రశంసిస్తూ ‘TIME’ మ్యాగజైన్ పబ్లిష్ చేసినది ఒక ప్రకటన.

Share.

About Author

Comments are closed.

scroll