Fake News, Telugu
 

బ్యాంక్ KYC కోసం NPR పత్రం తప్పనిసరి కాదు

0

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) వారిచే జారీచేయబడిన లెటర్ సమర్పించకుంటే బ్యాంకు ఖాతా నుండి డబ్బులు తీసుకోలేరు అని చెప్తూ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు KYC (Know Your Customer – మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) కి సంబంధించి విడుదల చేసిన ప్రకటన ఫోటోని చాలా మంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: NPR పత్రం సమర్పించకుంటే బ్యాంకు ఖాతా నుండి డబ్బులు తీసుకోలేరు. 

ఫాక్ట్ (నిజం): ప్రకటనలో KYC పత్రాల రుజువు కోసం ఇచ్చిన లిస్టులో ఏదైనా ఒక్క డాక్యుమెంట్ సమర్పిస్తే చాలు అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వివరణ ఇచ్చారు. NPR పత్రం తప్పనిసరి కాదు. కావున పోస్ట్ లో NPR పత్రం సమర్పించకుంటే బ్యాంకు ఖాతా నుండి డబ్బులు తీసుకోలేరని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్టులో పెట్టిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటనను 11 జనవరి 2020 ఈనాడు వార్తాపత్రిక లో చూడవొచ్చు. KYC పత్రాల రుజువు కోసం ఇచ్చిన డాక్యుమెంట్ లిస్టు లో ‘NPR వారిచే జారీచేయబడిన లెటర్’ కూడా ఉన్నట్టు చూడవొచ్చు. కానీ, లిస్టులో ఉన్న అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని ప్రకటనలో ఎక్కడా కూడా రాసి లేదు.

భారత దేశంలో బ్యాంకుల వ్యవస్థ ను నియంత్రిచేది రిజర్వు బ్యాంకు. రిజర్వు బ్యాంకు రూల్స్ లో లేనిది ఏది కూడా బ్యాంకులు సాధారణంగా చెయ్యవు.

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్.బీ.ఐ) వెబ్ సైట్ లోని ‘Master Direction – Know Your Customer (KYC) Direction, 2016’ లో కూడా “Officially Valid Document” లిస్టులో NPR ఉన్నట్టు చూడవొచ్చు. అయితే, అక్కడ కూడా NPR పత్రం తప్పనిసరి అని రాసి లేదు.

తాము ఇచ్చిన ప్రకటన ని ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నందున, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ ఇస్తూ 11 జనవరి 2020 న మరొక ప్రకటన ఇచ్చారు. ‘జాబితాలో పేర్కొనబడిన గుర్తింపు యొక్క రుజువు మరియు చిరునామా రుజువు కోసం అధిరికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలలో ఏదైనా ఒకటి కస్టమర్ సమర్పించవచ్చును’ అని వివరణ ఇచ్చినట్టు ఆ ప్రకటన లో చూడవొచ్చు.

చివరగా, బ్యాంక్ KYC కోసం NPR పత్రం తప్పనిసరి కాదు. అధిరికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలలో NPR పత్రం కూడా ఒకటి. KYC కోసం అధిరికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలలో ఏదైనా ఒకటి బ్యాంకులో సమర్పించవచ్చు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll