Fake News, Telugu
 

‘ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్’ అనే చిత్రానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీకి తప్పుగా ముడి పెడుతున్నారు

0

అమ్మాయిని తన చేతుల్లో మోస్తున్న ఒక వ్యక్తి ఫోటోను చూపిస్తూ, అందులో ఉన్నది రాహుల్ గాంధీ అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: ఒక అమ్మాయిని తన చేతుల్లో మోస్తున్న రాహుల్ గాంధీ ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో అమ్మాయిని తన చేతుల్లో మోస్తున్నది రాహుల్ గాంధీ కాదు. ఆ వ్యక్తి నటుడు జామీ డోర్నన్, ఫోటోలోని మహిళ హాలీవుడ్ నటి డకోటా జాన్సన్. ఇది ‘ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్’ అనే చిత్రంలోని ఒక సన్నివేశానికి సంబంధించిన ఫోటో. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, స్టాక్ ఫోటో వెబ్సైటు ఆలమి (alamy)లో అదే ఇమేజ్ చూడొచ్చు. ‘JAMIE DORNAN, DAKOTA JOHNSON, FIFTY SHADES FREED, 2018’ అనే టైటిల్‌తో ఈ ఇమేజ్ ఆ వెబ్సైటులో ఉంది, కానీ రాహుల్ గాంధీ గురించి అక్కడ ఏమీ లేదు. టైటిల్‌లోని కీ వర్డ్స్ ఉపయోగించి గూగుల్లో వెతకగా, ఈ ఫోటో ‘ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్’ అనే చిత్రంలోని ఒక సన్నివేశానికి సంబంధించిన ఫోటో అని ఆర్టికల్స్ ద్వారా ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇలాగే మే నెలలో కూడా ఇటువంటి క్లెయిమ్ బాగా వైరల్ అయినప్పుడు, కొన్ని ఆర్టికల్స్ దీని గురించి ప్రస్తావించాయి. ఇదంతా ఒక దేశీ ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ నుండి ప్రారంభమైందని, ఆమె ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ఫ్రాంచైజీ నుండి ఫోటోను తన తల్లికి చూపించినప్పుడు, రాహుల్ గాంధీకి గర్ల్ ఫ్రెండ్ ఎప్పటినుంచి ఉందని అడిగారని తెలిపారు. చిత్రంలోని మహిళ హాలీవుడ్ నటి డకోటా జాన్సన్, వ్యక్తి గాంధీ కాదు, నటుడు జామీ డోర్నన్. 

చివరగా, ‘ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్’ అనే చిత్రానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీకి తప్పుగా ముడి పెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll