Fake News, Telugu
 

కట్నం ఇవ్వకుంటే పెళ్లి మధ్యలోనే ఆపేస్తానని బెదిరిస్తున్న ఈ దృశ్యాలు నిజమైన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో

0

‘బీహార్‌లో ఒక వ్యక్తి పెళ్లి పీటలపైనే కట్నం ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడంటూ’ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలోని వ్యక్తి కట్నం ఇవ్వకపోతే పెళ్లిని ఆపేస్తానంటూ బెదిరిస్తుండడం గమనించొచ్చు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీహార్‌లో ఒక వ్యక్తి కట్నం పూర్తిగా ఇవ్వాలని లేదంటే పెళ్లి మధ్యలోనే ఆపేస్తానంటూ బెదిరిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని దృశ్యాలు నిజమైన ఘటనకు సంబంధించినవి కావు. ఇది నటీనటులతో చిత్రీకరించిన ఒక స్క్రిప్టెడ్ డ్రామా. దివ్య విక్రమ్ అనే వీడియో క్రియేటర్ తన ఫేస్‌బుక్‌ పేజీలో  ఈ వీడియోని మొదట షేర్ చేసాడు. ఐతే ఇది ఒక స్క్రిప్టెడ్ డ్రామా అని, నటీనటులతో చిత్రీకరించినట్టు ఆ ఫేస్‌బుక్‌ పేజీలో అడ్మిన్ మాకు స్పష్టం చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఐతే వీడియోలోని దృశ్యాలు నటీనటులతో చిత్రీకరించిన స్క్రిప్టెడ్ డ్రామా, నిజమైన ఘటన కాదు. వైరల్ వీడియోకి సంబంధించి సమాచారం కోసం ఫేస్‌బుక్‌లో వెతకగా, ఈ వీడియోని దివ్య విక్రమ్ అనే వీడియో క్రియేటర్ తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది.

ఈ పేజీలో ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు చాలా ఉన్నాయి. వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తులు నటించిన పలు వీడియోలు కూడా ఈ పేజీలో ఉన్నాయి.

ఐతే వైరల్ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం దివ్య విక్రమ్ ఫేస్‌బుక్‌ పేజీ  అడ్మిన్‌ని సంప్రదించగా, ఈ వీడియోలోని దృశ్యాలు ఒక స్క్రిప్టెడ్ డ్రామా అని, నటీనటులతో చిత్రీకరించినట్టు స్పష్టం చేసాడు. సామాజిక అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్టు తెలిపాడు.

ఇదే వీడియోని పలు స్థానిక మీడియా సంస్థలు మరియు జాతీయ మీడియా సంస్థలు  బీహార్‌లో జరిగిన నిజమైన ఘటనగా రిపోర్ట్ చెయ్యడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐతే పలు వార్తా సంస్థలు ఇది స్క్రిప్టెడ్ వీడియో అని ఆ తర్వాత ఒక అప్డేట్‌ని ప్రచురించారు.

చివరగా, కట్నం ఇవ్వకుంటే పెళ్లి మధ్యలోనే ఆపేస్తానని బెదిరిస్తున్న ఈ దృశ్యాలు నిజమైన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll