Fake News, Telugu
 

బార్సిలోనా ప్రజలు లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలని, ముస్లిం అతివాద వ్యక్తులపై ఫ్రాన్స్ పోలీసులు చేస్తున్న దాడులుగా షేర్ చేస్తున్నారు

0

ముస్లిం అతివాద వ్యక్తులపైన ఫ్రాన్స్ పోలీసులు చేస్తున్న దాడులు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలిసులపై తిరగబడుతున్న వ్యక్తులని పోలీసులు అదుపులో పెడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లిం అతివాద వ్యక్తులపై ఫ్రాన్స్ పోలీసులు దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): స్పెయిన్ దేశంలో కొత్తగా విధించిన లాక్ డౌన్ నియమాలని వ్యతిరేకిస్తూ బార్సిలోనా ప్రజలు  అక్కడి  పోలీసులకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ వీడియో ఆ ఘటనకి సంబంధించినది. ఈ వీడియోకి ఫ్రాన్స్ దేశంలో ఇటివల జరిగిన ఉగ్రవాద చర్యలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలున్న వీడియోని షేర్ చేస్తూ ఒక న్యూస్ ఏజెన్సీ పెట్టిన ట్వీట్ దొరికింది. స్పెయిన్ దేశంలోని బార్సిలోనా లో విధించిన కొత్త లాక్ డౌన్ నియమాలని వ్యతిరేకిస్తూ కొందరు పోలీసులతో ఘర్షణకు దిగినట్టు అందులో తెలిపారు. ఈ ఘర్షణలో కొందరు పోలీసులు గాయపడినట్టు తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఆ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ ఘటనకి సంబంధించి ‘Dailymail’ న్యూస్ వెబ్ సైట్ ‘02 నవంబర్ 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. బార్సిలోనా లో విధించిన కొత్త లాక్ డౌన్ నియమాలని వ్యతిరేకిస్తూ ప్రజలు పోలీసులపై తిరగబడినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ చేసిన మరికొన్ని ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, బార్సిలోనా లో విధించిన కొత్త లాక్ డౌన్ నియమాలని వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన నిరసనలని ముస్లిం అతివాద వ్యక్తులపై ఫ్రాన్స్ పోలీసులు చేస్తున్న దాడులుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll