Fake News, Telugu
 

DMK నేత ఇంట్లో ఇటీవల జరిగిన IT దాడుల్లో 1000 కోట్లు జప్తు చేయలేదు

0

DMK పార్టీ నాయకుడికి చెందిన చెన్నైలోని ఒక IT సంస్థ కార్యాలయంలో జరిగిన IT రైడ్స్ లో 1000 కోట్ల నగదు దొరికిందని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

    ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: DMK పార్టీ నాయకుడికి చెందిన చెన్నైలోని ఒక IT సంస్థ కార్యాలయంలో జరిగిన IT రైడ్స్ లో 1000 కోట్ల నగదు దొరికింది.

ఫాక్ట్ (నిజం): కోయంబత్తూర్ కి చెందిన DMK నేత ఆర్. కృష్ణన్ విద్యా సంస్థలపై జరిగిన IT రైడ్ లో 150 కోట్లకు సంబంధించి  లెక్కించని పెట్టుబడులు (unaccounted investments and on-money) మరియు 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని ఒక IT ఇన్ఫ్రా కంపెనీ పై జరిగిన IT రైడ్స్ లో 1000 కోట్లకు సంబంధించి లెక్కించని ఆదాయం (unaccounted income) గుర్తించారు. ఐతే రెండు వేర్వేరు IT రైడ్స్ ని లింక్ చేసి DMK నేతపై జరిగిన IT దాడుల్లో 1000 కోట్ల నగదు లభించిందని ప్రచారం చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ విషయం గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్స్ తో వెతకగా ఇటీవల కోయంబత్తూర్ కి చెందిన DMK నేత ఆర్. కృష్ణన్ ఇంటితో సహా అయనకి చెందిన విద్యా సంస్థలకు సంబంధించి 22 చోట్ల జరిపిన IT రైడ్స్ జరిగినట్టు ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఐతే ఈ రైడ్స్ ద్వారా ఆర్. కృష్ణన్ 150 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని తెలిసింది. ఐతే ఈ వార్తా కథనాలలో ఎక్కడ కూడా ఈ సోదాల్లో 1000 కోట్లు లభించాయని చెప్పలేదు. ఇంకా ఈ రైడ్స్ లో 5 కోట్ల నగదు లభించింది. ఈ రైడ్స్ కి సంబంధించి ఆదాయ పన్ను శాఖ వారు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం ఈ రైడ్ లో 150 కోట్లకు సంబంధించి  లెక్కించని పెట్టుబడులు (unaccounted investments and on-money) మరియు 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఉంది. ఈ రైడ్ కి సంబంధించి ఆదాయ పన్ను శాఖ వారు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో ఎక్కడ కూడా ఈ సోదాల్లో 1000 కోట్లు లభించాయని చెప్పలేదు.

ఐతే గూగుల్ సెర్చ్ ద్వారా ఇటీవల చెన్నై లోని ఒక IT ఇన్ఫ్రా గ్రూప్ లో జరిగిన IT రైడ్స్ కి సంబంధించిన వార్తను ప్రచురించిన కొన్ని కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం చెన్నై కి చెందిన ఒక IT ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన చెన్నై మరియు మదురై కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో 1000 కోట్లకు సంబంధించి లెక్కించని ఆదాయం (unaccounted income) గుర్తించినట్టు తెలిసింది. ఈ ఘటనకి సంబంధించి మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ కథనాలలో ఎక్కడా కూడా ఈ IT కంపెనీ DMK నేతకు చెందినట్టు చెప్పలేదు. ఈ రైడ్ కి సంబంధించి ఆదాయ పన్ను శాఖ వారు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ఇక్కడ చూడొచ్చు.

వీటన్నిటి ఆధారంగా DMK నేతపై జరిగిన IT రైడ్ మరియు IT కంపెనీపై జరిగిన రైడ్ రెండు వేరని తెలుస్తుంది. DMK నేత పై జరిగిన రైడ్ లో 1000 కోట్ల నగదు లభించలేదని కచ్చితంగా చెప్పొచ్చు. పైగా పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో 2016లో ఢిల్లీలోని ఒక న్యాయ సేవ సంస్థపై జరిగిన IT దాడులకు సంబంధించినదిగా తెలిసింది.

చివరగా, పోస్ట్ లో తెలిపినట్టు DMK నేత పై జరిగిన రైడ్ లో 1000 కోట్ల నగదు లభించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll