Fake News, Telugu
 

శ్రీలంకలో జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోని మదనపల్లిలో టీడీపీ సభ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘జై బాలయ్య, జై తెలుగు దేశం నినాదాలతో మదనపల్లి మారుమోగింది’ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోతో ఉన్న పోస్ట్ షేర్ చేస్తున్నారు. దీంట్లో నిజానిజాలు చూద్దాం.

క్లెయిమ్: ‘మదనపల్లి  జై బాలయ్య జై తెలుగుదేశం నినాదాలతో దద్దరిల్లింది.’

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో జరిగిన నిరసనలకు సంబంధించినది. 2022, జులై 10వ తారీఖున శ్రీలంక రాష్ట్రపతి గొటబయ రాజపక్స నివాసాన్ని నిరసనకారులు ఆక్రమించారు. పోస్టులోని వీడియో ఆ ఆక్రమణకు సంబంధించినది. ఈ వీడియోకి మదనపల్లికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి పోస్టులో చేసిన దావా  తప్పు.

వీడియోలోని  స్క్రీన్ షాట్స్ ని యాండెక్స్ లో రెవెర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా మాకు ‘బిట్ చుట్’ అనే వెబ్సైటులో ఉన్న ఒక రిపోర్ట్ కి లింక్ దొరికింది. అందులో ‘ఆర్థిక మాంద్యం నేపధ్యం లో శ్రీలంకలో నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని  ఆక్రమించారు’ అనే శీర్షిక తో ఒక వీడియో ఉంది.

 ఈ సంఘటన  శ్రీలంకలోని ఆర్ధిక సంక్షోభం సందర్భంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించిందిగా ఈ వీడియోను చూడగా అర్థం అయ్యింది. ఒరిజినల్ పోస్ట్ లో ఉన్న వీడియోలోని కొంత భాగం ‘బిట్ చుట్’ వీడియోలోని కొంత భాగానికి మ్యాచ్ అయ్యింది. గూగుల్ లో సరైన కీవర్డ్స్ తో  సెర్చ్ చేయగా ఇదే నిరసనకు సంబంధించిన మరిన్ని సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి.

వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో ఉన్న గోధుమ రంగు బిల్డింగ్ శ్రీలంక ప్రెసిడెన్సియల్ సెక్రటరియేట్ బిల్డింగ్. గూగుల్ మ్యాప్స్ లోని ఈ చిత్రాలు చుస్తే మనకు స్పష్టంగా రెండు ఒకే బిల్డింగులు అని అర్థం అవుతుంది.

మదనపల్లిలో టీడీపీ యొక్క మహానాడు సభ జులై 6వ తారీఖున జరిగింది.ఆ సభకు సంబంధించిన వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, శ్రీలంకలో జరుగుతున్న నిరసనలకు సంబంధించిన వీడియోను మదనపల్లి టీడీపీ సభ ‘జై బాలయ్య జై తెలుగుదేశం నినాదాలతో దద్దరిల్లింది’ అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll