Fake News, Telugu
 

న్యూస్ పేపర్ల PDF కాపీలు షేర్ చేయడం అన్ని సందర్భాల్లో చట్టరీత్యా నేరం కాదు

0

వాట్సాప్ గ్రూపుల్లో న్యూస్ పేపర్ల పీడీఎఫ్ (PDF) కాపీలు షేర్ చేయడం చట్టరీత్యా నేరమని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు . ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: వాట్సాప్ గ్రూపుల్లో న్యూస్ పేపర్ల PDF కాపీలు షేర్ చేయడం చట్టరీత్యా నేరం.

ఫాక్ట్ (నిజం): కాపీరైట్ చట్టం ప్రకారం ఒక న్యూస్ ఐటమ్ పై కాపీరైట్ లేకున్నా, న్యూస్ ప్రచురించే విధానం పై కాపీరైట్ ఉంటుంది. కొన్ని వార్తా సంస్థలు PDF కాపీలు పై కొంత సభ్యత్య రుసుము తీసుకుంటారు, అలాంటి న్యూస్ పేపర్ల PDF కాపీలు షేర్ చేయడం చట్టరీత్యా నేరం. మరికొన్ని వార్తా సంస్థలు PDF కాపీలు ఉచితంగా ఇస్తారు, వాటిని షేర్ చేయడం చట్టరీత్యా నేరం కాకపోయినా కొన్ని సందర్భాల్లో వాటి పై కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. కావున పోస్ట్ లో చెప్పింది కొంత వరకు నిజం. 

పోస్టులోని విషయం గురించి కాపీరైట్ చట్టంలో వెతకగా, ఒక న్యూస్ ఐటమ్ పై కాపీరైట్ లేకున్నా, న్యూస్ ప్రచురించే విధానం పై కాపీరైట్ ఉంటుందని తెలిసింది. సెక్షన్ 43 (బీ) (ఐటీ చట్టం 2002) లో కూడా దీనికి సంబంధించిన చట్టాన్ని చూడవొచ్చు. ఈ విషయం పై ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా మాట్లాడుతూ, ‘ఉచితంగా వచ్చే PDF కాపీలు షేర్ చేయవొచ్చు, కానీ సభ్యత్య రుసుము కట్టి తీసుకునే PDF కాపీలు షేర్ చేయడం సరికాదు’ అని చెప్పినట్టు ఇండియా టుడే ఆర్టికల్ లో చదవొచ్చు.

‘The Free Press Journal’ వార్తసంస్థ ఈ విషయంపై స్పందిస్తూ, తమ ఈ-పేపర్ సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చని, అది చట్టరీత్యా నేరం కాదని తెలిపింది. లాక్ డౌన్ లో ప్రజలు ఇబ్బంది పడకూడదని తాము ఫ్రీగా PDF కాపీలు పంచుతున్నామని ఈ వార్త పై సునీల్ జైన్ (ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ బిజినెస్ ఎడిటర్) స్పందించారు.

కొన్ని వార్తా సంస్థలు PDF కాపీలు పై కొంత సభ్యత్య రుసుము తీసుకుంటారు, అలాంటి న్యూస్ పేపర్ల PDF కాపీలు షేర్ చేయడం చట్టరీత్యా నేరం. అయితే, కొన్ని సందర్భాల్లో వాణిజ్యేతర అవసరాల కోసం ఉపయోగించవచ్చు. ఈ విషయాల గురించి ‘ది హిందూ’ ఈ-పేపర్ వెబ్సైటులో చదవొచ్చు.

టైమ్స్ అఫ్ ఇండియా మరియు ఎకనిమిక్ టైమ్స్ న్యూస్ పేపర్లను డౌన్లోడ్ చేసి ‘www.sscias.com’ అనే వెబ్సైటు షేర్ చేసినందున, ఆ వెబ్ సైట్ పై 2019 లో ‘Bennett, Coleman & Co (BCCL)’ పై కేసు వేసింది. అలా డౌన్లోడ్ చేసి షేర్ చేయడం వల్ల తమ మీడియా సంస్థ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని, ఎందుకంటే దాని వల్ల వార్తాపత్రిక యొక్క అమ్మకాలు మరియు BCCL వెబ్‌సైట్‌లకు వచ్చే ఆన్‌లైన్ సందర్శకుల సంఖ్య తగ్గుతాయని తెలిపారు. ఈ కేసు పై హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ చదవవొచ్చు.

చివరగా, న్యూస్ పేపర్ల PDF కాపీలు షేర్ చేయడం అన్ని సందర్భాల్లో చట్టరీత్యా నేరం కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll