Fake News, Telugu
 

మోదీ గెలిస్తే పాకిస్తాన్ వెళ్ళిపోతానని షబానా ఆజ్మీ అనలేదు

0

బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మోదీ గెలిస్తే భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్పింది అంటూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):  షబానా ఆజ్మీ: “మళ్ళీ నరేంద్ర మోదీ గెలిస్తే నేను పాకిస్తాన్ వెళ్ళిపోతాను.”

ఫాక్ట్ (నిజం):  పోస్ట్ లో చెప్పినట్టుగా షబానా ఆజ్మీ ఎలాంటి వాఖ్యలు చేయలేదు. తన ట్విట్టర్ అకౌంటు ద్వారా షబానా ఆజ్మీ ఆ వాఖ్యాలను ఖండించింది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో “Shabana Azmi to leave India” అని వెతికితే, సెర్చ్ రిజల్ట్స్ లో ఈ విషయం పై ‘The Economic Times’ ప్రచురించిన ఆర్టికల్ ఒకటి వస్తుంది. ఆ ఆర్టికల్ లో షబానా ఆజ్మీ పోస్ట్ లోని వాఖ్యాలను ఖండిస్తూ చేసిన ట్వీట్ ఉంటుంది. ఆ ట్వీట్ లో తను భారత దేశాన్ని విడిచిపోతానని చెప్పినట్టుగా వస్తున్న  వాఖ్యల్లో నిజం లేదని, తను పుట్టిన భారతదేశం లోనే చనిపోయే దాకా ఉంటానని రాసింది.

షబానా ఆజ్మీ పేరు మీదనే కాకుండా ఇతర సెలెబ్రిటీల మీద కూడా ఇలాంటి ఫేక్ పోస్టులే ఫేస్బుక్ లో చాలా షేర్ అవుతున్నాయి. మోదీ గెలిస్తే జావేద్ అక్తర్, షారుఖ్ ఖాన్ దేశం విడిచిపెట్టి వెళ్లిపోతామని అన్నట్టుగా మరియు మమతా బెనర్జీ సూసైడ్ చేసుకుంటానని అన్నట్టుగా ఉన్న పోస్టుల పై FACTLY ఇంతకు ముందే రాసిన ఇంగ్లీష్ ఆర్టికల్ ఇక్కడ చదవచ్చు.

చివరగా, మోదీ గెలిస్తే పాకిస్తాన్ వెళ్ళిపోతానని షబానా ఆజ్మీ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll