ఇద్దరు రౌడీలు ఒక అమాయక వెయిటర్‌ని తరచూ రెస్టారెంట్‌కి వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఒక రియల్ హీరో వారికి ఇలా బుద్ధి చెప్పాడంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇద్దరు రౌడీలు ఒక అమాయక వెయిటర్‌ని తరచూ రెస్టారెంట్‌కి వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఒక రియల్ హీరో వారికి బుద్ధి చెబుతున్న వీడియో.
ఫాక్ట్: ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు; కేవలం వినోదంకోసమే తీసినట్టు ఆ వీడియో చేసిన నితిన్ మార్టిన్ వీడియో మొదట్లో వివరణ పెట్టారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న పూర్తి నిడివిగల వీడియో నితిన్ మార్టిన్ అధికారిక ఫేస్బుక్ పేజీలో లభించింది. ఈ పూర్తి వీడియో మొదట్లో ఈ యొక్క కంటెంట్ కేవలం వినోదం కోసమే తీసారని ఒక వివరణ (0:41 టైంస్టాంప్ దగ్గర) కూడా ఉంది. పైగా పోస్టులో చెప్పిన కథ ఆ ఫేస్బుక్ పేజీలో నిజం అని చెప్పలేదు. ఐతే ఈ వైరల్ వీడియోలోని వివరణ ఉన్న భాగాన్ని తీసేసి కేవలం మిగితా భాగాన్నే నిజమైన కథగా షేర్ చేస్తున్నారు.
నితిన్ మార్టిన్ అధికారిక ఫేస్బుక్ పేజీ ప్రకారం అతనొక యాక్టర్. ఇటువంటి మరెన్నో వీడియోలు అతని ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్‌లో చూడొచ్చు.
చివరగా, ఇద్దరు రౌడీలు ఒక అమాయక వెయిటర్‌ని తరచూ రెస్టారెంట్‌కి వచ్చి ఇబ్బంది పెడుతుంటే వారికి బుద్ధి చెప్పిన రియల్ హీరో అంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో నిజంగా జరిగిన సంఘటన కాదు.