Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని, ఫోటోకి ఫోజ్ ఇస్తూ ప్రత్యర్ధి పార్టీ చీపురు గుర్తుకి ప్రధాని మోదీ ఓటేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఫోటోకి ఫోజిచ్చే మోజులోపడి తన పార్టీ గుర్తు కమలానికి ఓటెయ్యబోయి ప్రత్యర్ధి పార్టీ చీపురు గుర్తుకి ఓటేసిన విశ్వగురువుగా ప్రచారం కాబడుతున్న మోడీ”, అని చెప్తూ ప్రధాని మోదీ ఓటు వేస్తున్నట్టు చూపిస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఫోటోకి ఫోజ్ ఇస్తూ తన పార్టీ గుర్తు కమలానికి ఓటు వెయ్యబోయి, ప్రత్యర్ధి పార్టీ చీపురు గుర్తుకి ప్రధాని మోదీ ఓటేసినట్టు వీడియోలో చూడవచ్చు.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో ఎడిట్ చేయబడింది. 05 డిసెంబర్ 2022న గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో తీసుకొని, సంబంధంలేని మరో వీడియోని మధ్యలో జోడించారు. అంతేకాదు, ప్రధాని మోదీ ఓటు వేసింది సబర్మతి నియోజకవర్గంలో, కానీ వీడియోలోని ఈవీఎం ఆ నియోజకవర్గానికి సంబంధించింది కాదు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, 05 డిసెంబర్ 2022న గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది. అయితే, అందులో ఎక్కడా కూడా EVMకి సంబంధించిన విజువల్స్ లేవు.

అంతేకాదు, ప్రధాని మోదీ ఓటు వేసింది సబర్మతి నియోజకవర్గంలో, కానీ వీడియోలోని EVM ఆ నియోజకవర్గానికి సంబంధించింది కాదు. సబర్మతి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు మరియు EVM విజువల్స్‌లో ఉన్న అభ్యర్థులు వేరుగా ఉన్నట్టు గమనించవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని ఫోటోకి ఫోజ్ ఇస్తూ ప్రత్యర్ధి పార్టీ చీపురు గుర్తుకి ప్రధాని మోదీ ఓటేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll