Fake News, Telugu
 

ఏజ్ సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల UKలో ది కేరళ స్టొరీ సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపోవడాన్ని, బ్యాన్ చేసిన్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘ది కేరళ స్టొరీ’ సినిమా విద్వేషాలను రగిలించేలా ఉందని ఆ దేశ సినిమా నియంత్రణ సంస్థ BBFC ప్రకటించడంతో ఆ సినిమాను UK నిషేదించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ‘ది కేరళ స్టొరీ’ సినిమాను విద్వేషాలను రగిలించేలా ఉందని ఆ దేశ సినిమా నియంత్రణ సంస్థ BBFC ప్రకటించడంతో ఆ సినిమాను UK నిషేదించింది.

ఫాక్ట్(నిజం): ‘ది కేరళ స్టొరీ’ సినిమాకు ఏజ్ సర్టిఫికేషన్ లేకపోవడంతో UKలో సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోయింది. తిరిగి వారం రోజుల తరవాత BBFC సినిమాకు 18 రేటింగ్ ఇచ్చిన అనంతరం మే 19న సినిమా విడుదల జరిగింది. సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపోవడాన్ని తప్పుగా అర్ధం చేసుకొని బ్యాన్ చేసినట్టు ప్రచారం చేస్తున్నారు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ది కేరళ స్టొరీ సినిమా UKలో విడుదలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, పోస్టులో చెప్తున్నట్టు ఈ సినిమాను UKలో బ్యాన్ చేయలేదు. కేవలం UKలో సినిమాకు సంబంధించి ఇచ్చే ఏజ్ సర్టిఫికేషన్ లేకపోవడంతో సినిమా విడుదల కొన్ని రోజులు ఆగిపోయింది.

అసలు షెడ్యూల్ ప్రకారం ‘ది కేరళ స్టొరీ’ సినిమా UKలో ఈ నెల మే 12న  విడుదల కావలసి ఉండింది. ఐతే సినిమాకు సంబంధించి బ్రిటీష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (BBFC) ఇవ్వాల్సిన రేటింగ్(వయస్సు) నిర్ణీత సమయంలో ఇవ్వలేకపోవడం వలన చివరి నిమిషంలో ఈ సినిమా ప్రదర్శనలను నిలిపేశారు. అలాగే సినిమా టికెట్లు బుక్ చేసుకున్న వారందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేసారు. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

సాధారణంగా UKలో సినిమా విడుదల చేయాలంటే ముందుగా సినిమా ఏ వయసు వాళ్ళకు సంబంధించిందో తెలిపే ఏజ్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. కేవలం ఈ సర్టిఫికేట్ లేనందువల్లే ‘ది కేరళ స్టొరీ’ విడుదల ఆలస్యం అయ్యింది. కాగా BBFC 18 రేటింగ్ ఇచ్చిన అనతరం 19 మే 2023న ఈ సినిమా UKలో విడుదలైంది (ఇక్కడ మరియు ఇక్కడ) .

ఈ సినిమా విడుదల సమయంలో కొందరు ముస్లిం ఆక్టివిస్ట్‌లు అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు కొన్ని కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరగా, ఏజ్ సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల UKలో ది కేరళ స్టొరీ సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపోవడాన్ని, బ్యాన్ చేసిన్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll