Fake News, Telugu
 

ఆరు నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన కలశ యాత్రకు సంబంధించిన దృశ్యాలను అయోధ్యకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

అప్‌డేట్ (23 జనవరి 2024): సీతాదేవి కోసం తన పుట్టిల్లు నేపాల్ నుండి అయోధ్య రామ మందిరానికి కానుకలు పంపుతున్నారని ఇదే వీడియోని మరికొందరు షేర్ చేస్తున్నారు. అయితే కింద చెప్పిన విధంగా ఈ వీడియో అయోధ్యకు వచ్చే నేపాల్ భక్తులకు చెందినది కాదు. నేపాల్ నుంచి అయోధ్యకు వచ్చిన కానుకలు, భక్తులకు సంబంధించిన వివరాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో అయోధ్యలో నిర్వహించిన కలశ పూజ దృశ్యాలు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలో నిర్వహించిన కలశ పూజ దృశ్యాలు.

ఫాక్ట్(నిజం):  ఈ దృశ్యాలు జులై 2023లో గ్రేటర్ నోయిడాలో ధీరేంద్ర శాస్త్రి శ్రీమద్ భగవత్ కథ సందర్భంగా నిర్వహించిన కలశ యాత్రకు సంబంధించినవి. ఇటీవల అయోధ్యలో అక్షత కలశ యాత్ర జరినట్టు రిపోర్ట్స్ ఉన్నప్పటికీ, ఈ దృశ్యాలు అయోధ్యకు సంబంధించినవి కావు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

జనవరి 2024లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో ఇటీవల అయోధ్య రామ మందిరం నుంచి దేశవ్యాప్తంగా అక్షత కలశ యాత్ర ప్రారంభమైంది (ఇక్కడ & ఇక్కడ). ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ దృశ్యాలు మాత్రం అయోధ్య కలశ యాత్రకు సంబంధించినవి కావు.

ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను జులై 2023లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం గ్రేటర్ నోయిడాలో ధీరేంద్ర శాస్త్రి శ్రీమద్ భగవత్ కథ సందర్భంగా నిర్వహించిన కలశ యాత్రకు సంబంధించినవి.

గ్రేటర్ నోయిడాలో జులై 2023లో జరిగిన కలశ యాత్రను రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఇటీవల అయోధ్యలో కలశ యాత్ర జరిగిన విషయం నిజమే అయినప్పటికీ ఈ దృశ్యాలు మాత్రం ఆ కలశ యాత్రకు సంబంధించినవి కావని స్పష్టమవుతుంది.

చివరగా, జులై 2023లో గ్రేటర్ నోయిడాలో జరిగిన కలశ యాత్రకు సంబంధించిన దృశ్యాలను అయోధ్యకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll