+371, +375 మరియు +381 అంతర్జాతీయ కోడ్‌లతో, కొన్ని దేశాల నుండి వచ్చే మోసపూరిత మిస్డ్ కాల్‌ల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోస్ట్(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం చలామణిలో ఉంది. ఈ పోస్ట్ ప్రకారం, స్కామర్‌లు అంతర్జాతీయ నంబర్ల నుండి కాల్‌ను చేసి, ఒక్క సార్ రింగ్(వన్-రింగ్) అయినాక కట్ చేస్తారు. ఈ కాల్‌ను అందుకున్న వారు కనుక తిరిగి ఆ స్కామర్లకు కాల్ చేస్తే, స్కామర్‌లు వెంటనే ఆ వ్యక్తి యొక్క కాంటాక్ట్ లిస్ట్‌ను మరియు వారి బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను దొంగిలిస్తారు. అలాగే ,ఈ పోస్టులో ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఫోన్లు ఉపయోగించే వినియోగదారులు కనుక స్కామర్లు అడిగినప్పుడు తమ ఫోన్‌లలో #90 మరియు #09 కోడ్‌లను ఎంటర్ చేస్తే, వారీ SIM కార్డ్ వివరాలను క్లోన్ చేయడానికి స్కామర్‌లకు అవకాశం దొరుకుతుందట . తద్వారా ఆ వ్యక్తి యొక్క SIM కార్డు వివరాలను స్కామర్లు ఉపయోగించి స్కాములు చేసే అవకాశం ఉందట . అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: తెలియని అంతర్జాతీయ నంబర్ల నుండి స్కామర్‌లు మిస్డ్ కాల్‌లు చేసి, తద్వారా వ్యక్తిగత మరియు బ్యాంక్ వివరాలను దొంగిలిస్తారు. ఫోన్‌లో #90 మరియు #09 కోడ్‌లను మనం డయల్ చేస్తే, స్కామర్‌లు మన SIM కార్డు వివరాలను యాక్సెస్ చేస్తారు.
ఫ్యాక్ట్(నిజం): ఈ పొస్ట్ ‘వన్-రింగ్’ అనే ఫోన్ స్కామ్‌ను హైలైట్ చేస్తుంది. ఇందులో, అంతర్జాతీయ కాల్‌లు చేయడానికి వ్యక్తులపై విధించబడే అధిక అంతర్జాతీయ రేట్లు లేదా కనెక్షన్ ఫీజుల నుండి కమీషన్‌లను కొట్టేసే అవకాశాన్ని స్కామర్‌లు ఉపయోగించుకుంటారు. అయితే, ఈ స్కామ్ ద్వారా, వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ వివరాలు లేదా బ్యాంక్ సమాచారాన్ని దొంగిలించలేరు.అలాగే, మన మొబైల్ ఫోన్‌లో #90 లేదా #09 కోడ్‌లను డయల్ చేయించడం వాళ్ల స్కామర్‌లు మన SIM కార్డ్ వివరాలను యాక్సెస్ చేయలేరు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిగా ఉంది.
ముందుగా, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్‌ల వివరాల కోసం తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, 2019లో ఒక సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రచురించిన కథనం ఒకటి మాకు దొరికింది. ఇది కూడా వైరల్ పోస్టులో అంతర్జాతీయ కాల్స్ ద్వారా జరిగే స్కాముల గురించి చెప్తున్న వార్నింగ్ మెసేజ్ లాంటిదే. ఈ కథనం ‘వన్-రింగ్’ ఫోన్ స్కామ్ గురించి మాట్లాడుతుంది. ఈ స్కామ్ ద్వారా సైబర్ నేరగాళ్లు, అధికంగా ఉండే అంతర్జాతీయ కాల్ రేట్లు లేదా అంతర్జాతీయ కాల్‌లు చేయడానికి వసూలు చేసే ఇతర కనెక్షన్ ఫీజుల నుండి కమీషన్‌ను కొల్లగొడుతున్నారు అని ఈ కథనంలో ఉంది.
‘వన్-రింగ్’ ఫోన్ స్కామ్
‘వన్-రింగ్’ ఫోన్ స్కామ్, దీనిని “వంగిరి” స్కామ్ అని కూడా పిలుస్తారు. దీని ద్వారా స్కామర్లు, మామూలు ప్రజలను బురిడీ కొట్టించి, వాళ్లు ఖరీదైన అంతర్జాతీయ కాల్‌లు చేసేలాగ చేస్తారు.
ఈ స్కామ్‌లో సాధారణంగా స్కామర్లు కొన్ని రాండమ్ ఫోన్ నంబర్‌లకు క్లుప్తంగా, వన్-రింగ్ కాల్స్ చేస్తారు. ఇది ముఖ్యమైన కాల్ లేదా మిస్డ్ కాల్ కావచ్చునని భావించి,ఆ మిస్డ్ కాల్ అందుకున్న వ్యక్తులు కనున స్కామర్ నంబర్‌కు తిరిగి కాల్ చేస్తే, ఫోన్ చేసినవారు నష్టపోతారు. ఎందుకటే, ఆ రిటర్న్ కాల్‌ని ప్రీమియం-రేటు లైన్ లేదా అంతర్జాతీయ నంబర్‌కు ఆ స్కామర్లు తెలివిగా మళ్లిస్తారు. అలా తిరిగా కాల్ చేసిన వ్యక్తి నుంచి ఆ కాల్‌కు గాను, అధిక చార్జీలు వసూలు చేయడం జరుగుతుంది, దానిలో కొంత భాగం స్కామర్‌కు వెళుతుంది.
ఈ ‘వన్-రింగ్’ ఫోన్ స్కామ్ గురించి ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC), కొలంబియా ప్రభుత్వం మరియు అనేక ఇతర సంస్థలు ప్రజలను హెచ్చరించారు. అలాగే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు కూడా అనేక సందర్భాల్లో ఈ స్కామ్ గురించి ప్రజలను హెచ్చరించారు. అయితే, స్కామర్లు ‘వన్-రింగ్’ ఫోన్ స్కామ్ ద్వారా ఫోన్ నుంచి కాంటాక్ట్ లిస్ట్ వివరాలను మరియు బ్యాంక్ సమాచారాన్ని దొంగిలించవచ్చని వైరల్ పోస్టులో చేస్తున్న వాదనకు ఎటువంటి ఆధారం లేదు. ‘వన్-రింగ్’ ఫోన్ స్కామ్ నుండి ఎలా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే దానిపై మరిన్ని వివరాలను మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
#90 లేదా #09 కోడ్‌ని కీప్యాడ్‌లో డయల్ మనం డైల్ చేస్తే స్కామర్‌లు మన SIM కార్డ్ వివరాలను యాక్సెస్ చేయగలరా?
ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, ఈ స్కామ్‌కు సంబంధించి FCC ప్రచురించిన ఒక కథనాన్ని మేము కనుగొన్నాము. ప్రైవేట్ బ్రాంచ్ ఎక్స్ఛేంజ్ (PBX) లేదా ప్రైవేట్ ఆటోమేటిక్ బ్రాంచ్ ఎక్స్ఛేంజ్ (PABX) అందించే వ్యాపార ల్యాండ్‌లైన్ టెలిఫోన్‌లను లక్ష్యంగా చేసుకుని చేసే ఒక పాత టెలిఫోన్ స్కామ్ అని FCC దీని గురించి చెప్పింది.
ఈ కథనం ప్రకారం, PBX మరియు PABX వ్యాపార ల్యాండ్‌లైన్ ఫోన్‌లలో ఈ కోడ్‌లను డయల్ చేయడం ద్వారా, కాల్‌ను వేరే లైనుకు ట్రాన్స్ఫర్ చేయడానికి స్కామర్‌కు అనుమతిస్తుంది. కానీ ఇది సెల్‌ఫోన్‌లపై ఎలాంటి ప్రభావం చూపదు, అంటే వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా మనం మన ఫోన్‌లో #90 లేదా #09 కోడ్‌లను డయల్ చేయడం వళ్ల స్కామర్ మన SIM కార్డు వివరాలను యాక్సెస్ చేయలేరు.
ఇలా కొన్ని నంబర్‌లను డయల్ చేయడం ద్వారా SIM కార్డ్ వివరాలను స్కామర్లు యాక్సెస్ చేసే అవకాశం ఉంది అని ప్రజలను హెచ్చరిస్తూ వచ్చే మెసేజిలు, ఇ-మెయిల్‌లు అన్ని బూటకమని న్యూజిలాండ్ పోలీసులు మరియు అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు గతంలో స్పష్టం చేశాయి. SIM కార్డ్‌ని క్లోన్ చేసే వివిధ పద్ధతుల గురించి మరిన్ని వివరాలను మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, స్కామర్‌లు ‘వన్-రింగ్’ స్కామ్ ద్వారా వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను పొందలేరు, అలాగే #90 లేదా #09 కోడ్‌లను ఉపయోగించి SIM కార్డ్ సమాచారాన్ని దొంగిలించలేరు.