Fake News, Telugu
 

ఫేక్ ఫోటోలు పెట్టి అమ్మాయిలతో చనువుగా ఉంటూ డాన్స్ చేస్తున్న మహాత్మా గాంధీ అని ప్రచారం చేస్తున్నారు

0

మహాత్మా గాంధీ అమ్మాయిలతో చనువుగా ఉన్న ఫోటోలను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహాత్మా గాంధీ అమ్మాయిలతో చనువుగా ఉంటూ డాన్స్ చేస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో గాంధీ ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోలో గాంధీ వేషంలో ఉన్నది ఒక ఆస్ట్రేలియన్ నటుడు. మరొక ఫోటో 1946లో ముంబైలో జరిగిన అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ లో తీసిన గాంధీ, నెహ్రు ఫోటోని ఫోటోషాప్ చేసి నెహ్రు స్థానంలో ఒక అమ్మాయి ఫోటోని అతికించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఫోటో 1:

పోస్టులో గాంధీ ఒక అమ్మయితో డాన్స్ చేస్తున్న ఫోటో గురించి గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో గురించిన కొన్ని కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ ఫొటోలో గాంధీ వేషంలో ఉన్నది ఒక ఆస్ట్రేలియన్ నటుడు. 2012లో, సిడ్నీలో జరిగిన ఒక చారిటీ ఈవెంట్ లో అతను ఇలా గాంధీ వేషంలో వచ్చాడని ఈ కథనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఫోటోని దగ్గరగా చుస్తే గాంధీ వేషంలో ఉన్న వ్యక్తి చేతులు మంచి కండరాలు కలిగి వున్నాయి. కానీ నిజానికి గాంధీ చాలా  బక్కగా ఉంటాడు. ఇదే విషయాన్నీ చెప్తున్న మరికొన్ని కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. 

ఫోటో 2:

గాంధీ ఒక అమ్మయితో సన్నిహితంగా ఉన్న ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫొటోకు సంబంధించి ఒరిజినల్ ఇమేజ్ AP ఫోటో లైబ్రరీలో కనిపించింది. ఈ ఫోటో  1946లో ముంబైలో జరిగిన అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ లో తీసిందని వివరణలో రాసి ఉంది. ఐతే ఈ ఫోటోని దగ్గరగా చుస్తే మహాత్మా గాంధీ ఇందులో ఇంకా పోస్టులో  ఒకే పోజ్ లో ఉంటారు, దీన్ని బట్టి ఒరిజినల్ ఫొటోలో ఉన్న నెహ్రూ స్థానంలో ఒక అమ్మాయి ఫోటీని డిజిటల్ గా అతికించారని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, పోస్టులో మహాత్మా గాంధీ అమ్మాయిలతో చనువుగా ఉంటూ డాన్స్ చేస్తున్న ఉన్నవి ఫేక్ ఫొటోలు, ఫోటోషాప్ చేసినవి.

Share.

About Author

Comments are closed.

scroll