Fake News, Telugu
 

ఒక బ్రిటీష్ మహిళ పాడిన సంస్కృత శ్లోకాలు స్పెయిన్‌ రేడియో ఛానల్‌లో పాడినట్టు షేర్ చేస్తున్నారు

0

స్పెయిన్‌లో ఈ మహిళ రేడియో ఛానల్‌లో సంస్కృతంలో పాటలు పాడుతుందని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: స్పెయిన్‌లోని రేడియో ఛానల్‌లో సంస్కృతంలో శ్లోకాలు పాడుతున్న ఒక మహిళ వీడియో.

ఫాక్ట్: వీడియోలో సంస్కృతంలో పాడుతున్నది గాబ్రియెల్లా బర్నెల్ అనబడే బ్రిటీష్ మహిళ. ‘భోజనం మంత్ర’ అనబడే సంస్కృత మంత్రాన్ని వీడియోలో పాడుతున్నది. గాబ్రియెల్లా బర్నెల్ బ్రిటన్ లో, భారతీయ భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహిస్తుందని, ‘బ్రిటన్లో భారతదేశం యొక్క సాంస్కృతిక రాయబారి’ అని భారతదేశంలోని బ్రిటీష్ హై కమిషన్ ట్వీట్ కూడా చేసింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో యూట్యూబ్‌లో లభించింది. ‘భోజనం మంత్ర’ అనబడే సంస్కృత మంత్రాన్ని పాడుతున్నట్టు తెలిపారు. ఈ వీడియో 10 నవంబర్ 2019న గయా సంస్కృత్ అనబడే యూట్యూబ్‌ ఛానల్‌లో అప్లోడ్ చేసారు. అది పాడుతున్నది బ్రిటన్ కు చెందిన గాబ్రియెల్లా బర్నెల్ అని వీడియో యొక్క వివరణలోని సోషల్ మీడియా మరియు పేపాల్ అకౌంట్స్ ద్వారా తెలుస్తుంది.

గాబ్రియెల్లా బర్నెల్ అని గూగుల్లో వెతకగా భారతదేశంలోని బ్రిటీష్ హై కమిషన్ వారు ఆమె గురించి ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. గాబ్రియెల్లా బర్నెల్ బ్రిటన్ లో, భారతీయ భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహిస్తుందని మరియు ‘బ్రిటన్లో భారతదేశం యొక్క సాంస్కృతిక రాయబారి’ అనే పేరును సంపాదించిందని ఒక వీడియోతో ఉన్న ట్వీట్ ను పోస్ట్ చేసారు.

చిన్నప్పటినుండి తన తల్లిదండ్రులు ఆమెను సంస్కృతం నేర్చుకోవటంలో ఎలా ప్రోత్సహించరో ఈ వీడియో ఇంటర్వ్యూలో తెలిపారు. గాబ్రియెల్లా బర్నెల్ ఒక బ్రిటీష్ సంస్కృత స్కాలర్ అని తెలిపారు. తను ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారని, లండన్ లో సంస్కృతానికి సంబంధించి క్లాసులు కూడా చెబుతారని ఈ వెబ్సైటుల్లో (ఇక్కడ మరియు ఇక్కడ) తెలిపారు.

చివరగా, ఒక బ్రిటీష్ మహిళ పాడిన సంస్కృత శ్లోకాలను స్పెయిన్‌లోని రేడియో ఛానల్‌లో సంస్కృతంలో పాటలు పాడుతున్న ఒక మహిళ అంటూ షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll