Fake News, Telugu
 

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ టీవీ ఎలాంటి సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్

0

రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైస్సార్సీపీకి 132 స్థానాలు, టీడీపీ&జనసేన కూటమికి 41 స్థానాలు, ఇతరులకు 02 స్థానాలు వస్తాయని ‘రిపబ్లిక్ టీవీ’ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా రిపబ్లిక్ టీవీ సంస్థ లోగోతో కూడిన సర్వే ఫలితాలను చూపుతున్న స్క్రీన్ షాట్ ఒకటి షేర్ చేస్తున్నారు. అలాగే మరో పోస్టులో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ&జనసేన కూటమికి 132 స్థానాలు, వైస్సార్సీపీకి 41 స్థానాలు, ఇతరులకు 02 స్థానాలు వస్తాయని ‘రిపబ్లిక్ టీవీ’ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసింది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ విడుదల చేయలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఈ వైరల్ సర్వే ఫలితాల పై 02 మార్చి 2024న ‘రిపబ్లిక్ టీవీ’ వారి అధికారిక X(ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ“రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ లోగోతో  కొందరు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపబ్లిక్ నెట్‌వర్క్ ఎలాంటి ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించలేదని మేము స్పష్టం చేస్తున్నాము. ఇలాంటి తప్పుడు మరియు గందరగోళం సృష్టించే వార్తలకు మేము ఎలాంటి బాధ్యత వహించము.” అని ప్రకటన చేసింది. ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రీ-పోల్ సర్వే ఫలితాలు అంటూ కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి, అప్పుడు కూడా రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ అవి ఫేక్ పోస్టులు అని, వారు ఎలాంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది.కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ క్లెయిమ్స్ గురించి తగిన కీవర్డ్స్ ఉపయగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ విడుదల చేయలేదు అని తెలిసింది. ఈ వైరల్ క్లెయిమ్ పై 02 మార్చి 2024న రిపబ్లిక్ టీవీ తమ అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూరిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ లోగోతో  కొందరు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపబ్లిక్ నెట్‌వర్క్ ఎలాంటి ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించలేదని మేము స్పష్టం చేస్తున్నాము. ఇలాంటి తప్పుడు మరియు గందరగోళం సృష్టించే వార్తలకు మేము ఎలాంటి బాధ్యత వహించము.” అని ప్రకటన చేసింది.

ఇంతకుముందు కూడా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కి సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ ప్రీ పోల్ సర్వే ఫలితాలు అంటూ అనేక పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి వైరల్ పోస్టుల పై రిపబ్లిక్ టీవీ 08 ఫిబ్రవరి 2024న తమ అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూరిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ యొక్క మార్ఫింగ్ లోగోను ఉపయోగించి తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. రిపబ్లిక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని” స్పష్టం చేస్తూ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి, ఇప్పటివరకి రిపబ్లిక్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కి సంబంధించి ఎలాంటి ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేయలేదని నిర్థారించవచ్చు.

అదేవిధంగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి “ఏబీపీ-సీ ఓటర్” ప్రీ-పోల్ సర్వే ఫలితాలు అంటూ పలు పోస్టులు వైరల్‌ అయ్యాయి, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ టీవీ ఎలాంటి సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll