Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

‘రెమెడిసివిర్’ వల్ల కోవిడ్-19 తగ్గుతుందని కచ్చితంగా చెప్పలేమని, పరిశోధనలు జరుగుతున్నాయని దాన్ని తాయారు చేసిన గిలియడ్ సంస్థనే తెలిపింది

0

‘సంచలనం: వచ్చే వారం నుండి అందుబాటులోకి రానున్న కోవిడ్-19  మెడిసిన్’ అని చెప్తూ, ‘NTv Telugu’ న్యూస్ ఆర్టికల్ తో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: వచ్చే వారం నుండి అందుబాటులోకి రానున్న కోవిడ్-19 మెడిసిన్.

ఫాక్ట్ (నిజం): గిలియడ్ సంస్థ మరో వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుంది అని చెప్పింది ‘రెమెడిసివిర్’ డ్రగ్ గురించి, కొత్త మెడిసిన్ గురించి కాదు. అంతేకాదు, ‘రెమెడిసివిర్’ మీద కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎబోలా వ్యాధి కోసం మొదటిగా ‘రెమెడిసివిర్’ డ్రగ్ ని తాయారు చేసారు. అయితే, కోవిడ్-19 ఉన్నవారికి కూడా కొన్ని సందర్భాల్లో తొందరగా కోలుకోవడానికి ‘రెమెడిసివిర్’ పని చేస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలినందువల్ల, తాజాగా అమెరికా ప్రభుత్వం కోవిడ్-19 పేషంట్లకు ఇవ్వడానికి ఆమోదిచింది. కానీ, ‘రెమెడిసివిర్’ వల్ల కోవిడ్-19 తగ్గుతుందని కచ్చితంగా చెప్పలేమని గిలియడ్ సంస్థ వారి వెబ్సైటులో చదవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్టులో ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ (ఆర్కైవ్డ్) ని చదవగా, మరో వారం రోజుల్లో కోవిడ్-19  మెడిసిన్ అందుబాటులోకి వస్తుందని గిలియడ్ సంస్థ చెప్పినట్టు ఉంటుంది. ఆర్టికల్ లో ఒక దగ్గర ఏమో వాక్సిన్ అని ఉంటది, మరో దగ్గర ఏమో మెడిసిన్ అని రాసి ఉంటుంది. అంతేకాదు, ‘లీడ్ సంస్థ తయారు చేసిన రెమ్డేసివిర్ మెడిసిన్ మనిషిపై ప్రయోగం చేస్తూ విఫలం అయ్యింది’ అని కూడా ఆర్టికల్ లో ఉంటుంది.

మరో వారం రోజుల్లో కోవిడ్-19 కి ఏమైనా మందు వస్తుందని గిలియడ్ సంస్థ చెప్పిందా అని వెతకగా, గిలియడ్ సంస్థ చెప్పింది ‘మనిషిపై ప్రయోగం చేస్తూ విఫలం అయ్యింది’ అని NTv ఆర్టికల్ లో ఉన్న ‘రెమెడిసివిర్’ డ్రగ్ గురించే అని తెలుస్తుంది. మరో కొత్త మెడిసిన్ గురించి గిలియడ్ సంస్థ చెప్పలేదు. అంతేకాదు, ‘రెమెడిసివిర్’ మీద కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఎబోలా వ్యాధి కోసం మొదటిగా ‘రెమెడిసివిర్’ డ్రగ్ ని తాయారు చేసారు. అయితే, కోవిడ్-19 ఉన్నవారికి కూడా కొన్ని సందర్భాల్లో తొందరగా కోలుకోవడానికి ‘రెమెడిసివిర్’ పని చేస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలినందువల్ల, తాజాగా అమెరికా ప్రభుత్వం కోవిడ్-19 పేషంట్లకు ఇవ్వడానికి ఆమోదిచింది.

కానీ, ‘రెమెడిసివిర్’ వల్ల కోవిడ్-19 తగ్గుతుందని కచ్చితంగా చెప్పలేమని గిలియడ్ సంస్థ వారి వెబ్సైటులో చదవొచ్చు.

చివరగా, ‘రెమెడిసివిర్’ వల్ల కోవిడ్-19 తగ్గుతుందని కచ్చితంగా చెప్పలేమని, పరిశోధనలు జరుగుతున్నాయని దాన్ని తాయారు చేసిన గిలియడ్ సంస్థనే తెలిపింది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll