ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కార్యాలయం ఊడ్చేవాడని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా ఈ పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు మోదీ పార్టీ కార్యాలయం ఊడుస్తున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): అహ్మదాబాద్ కి చెందిన ఒక సామాజిక కార్యకర్త RTI ద్వారా పొందిన సమాచారం ప్రకారం ఈ ఫోటోలో ఉన్నది నరేంద్ర మోదీ కాదు, ఇది ఒక డిజిటల్ గా మార్ఫ్ చేసిన ఫోటో. దీన్నిబట్టి ఈ ఫోటోకి, మోదీకి ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
‘Modi Sweeping the floor’ అనే కీ వర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఈ ఫోటోకి సంబంధించి 20 జనవరి 2016న ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ వార్తా కథనం ప్రకారం అహ్మదాబాద్ కి చెందిన ఒక సామాజిక కార్యకర్త RTI ద్వారా ఈ ఫోటోకి సంబంధించిన సమాచారం కోరగా అతనికి అందిన జవాబు ప్రకారం ఇది ఒక డిజిటల్ గా మార్ఫ్ చేసిన ఫోటో అని, ఈ ఫోటోలో ఉన్నది నరేంద్ర మోదీ కాదని తెలిసింది. దీన్నిబట్టి ఈ ఫోటోకి, మోదీకి ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు.
చివరగా, డిజిటల్ గా మార్ఫ్ చేసిన ఫోటోని సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు మోదీ పార్టీ కార్యాలయం ఊడుస్తున్న ఫోటో అని షేర్ చేస్తున్నారు.