Fake News, Telugu
 

‘మైనర్ బాలికల అత్యాచారానికి మరణశిక్ష లౌకికం కాదనుకుంటా…’ అని రానా అయ్యుబ్ వ్యాఖ్యానించలేదు

0

‘కేంద్రం ప్రవేశ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ మైనర్ బాలికల అత్యాచారానికి మరణశిక్ష లౌకికం కాదనుకుంటా..! ఇది మైనారిటీ ప్రజలపై మోడీ చూపుతున్న వివక్ష. ఇది కుట్ర. వారికి మనుష్యులు కారా? వారి కోసం మానవ హక్కులు పని చేయవా?’ అని జర్నలిస్ట్ రానా అయ్యుబ్ వ్యాఖ్యానించినట్లుగా ‘Republic Tv’ పేరుతో ఉన్న ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ ని ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. పోస్టులో ఉన్న విషయం ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జర్నలిస్ట్ రానా అయ్యుబ్ – ‘కేంద్రం ప్రవేశ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ మైనర్ బాలికల అత్యాచారానికి మరణశిక్ష లౌకికం కాదనుకుంటా..! ఇది మైనారిటీ ప్రజలపై మోడీ చూపుతున్న వివక్ష. ఇది కుట్ర. వారికి మనుష్యులు కారా? వారి కోసం మానవ హక్కులు పని చేయవా?.

ఫాక్ట్ (నిజం): జర్నలిస్ట్ రానా అయ్యుబ్ ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టత ఇచ్చారు. పోస్టులో ఉన్న స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ‘Republic Tv’ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లోనిది కాదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో చెప్పిన దాని గురించి ‘Minor child rapists also humans, do they have no human right said by Rana Ayyub’ అని వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ, వాటిల్లో దేంట్లో కూడా రానా అయ్యుబ్ ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా లేదు. ఆ విషయం గురించి మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, పోస్టులోని స్క్రీన్ షాట్ ఆధారంగా ‘Rana Ayyubb’ చేసిన ట్వీట్ ఒకటి లభించింది. అందులో, రానా అయ్యుబ్ తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, స్క్రీన్ షాట్ లో ఉన్నది ఒక ఫోటోషాప్ చేసిన ట్వీట్ అని తెలిపింది.

మరియు, స్క్రీన్ షాట్ లోని ట్విట్టర్ హేండిల్ ‘@republicTv’ న్యూస్ ఛానల్ Republic TV వారి అధికారిక ట్విట్టర్ ఖాతాది కాదు, ఆ ఛానల్ ట్విట్టర్ హేండిల్ ‘@republic’ అని ఉంటుంది. కావున, స్క్రీన్ షాట్ లోని ట్వీట్ Republic TV వారు చేసినది కాదు.

చివరగా, ‘మైనర్ బాలికల అత్యాచారానికి మరణశిక్ష లౌకికం కాదనుకుంటున్నా…’ అని రానా అయ్యుబ్ వ్యాఖ్యానించలేదు. అలా ఆమె అన్నట్లుగా ఉన్న ట్వీట్ Republic Tv ఛానల్ వారి అధికారిక ట్విట్టర్ ఖాతాది కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll