Fake News, Telugu
 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి మతం మారిన వార్తను మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మతం మారినట్టు షేర్ చేస్తున్నారు

0

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇస్లాంను వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. కాశీలో పూజలు జరిపి హిందూ ధర్మంలో చేరాడు అంటూ చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇస్లాంను వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించాడు.

ఫాక్ట్(నిజం): మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఇస్లాంను విడిచి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు విశ్వసనీయమైన రిపోర్ట్స్ ఏవీ లేవు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన “ముహమ్మద్ అజారుద్దీన్” అనే వ్యక్తి ఇస్లాంను వదిలి హిందూ మతంలోకి మారడం గురించి వచ్చిన వార్తలను మాజీ క్రికెటర్‌  అజారుద్దీన్ మతం మారినట్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలో చెప్తున్నట్టు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇస్లాంను వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్టు మాకు ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ కనిపించలేదు. సాధారణంగా అజారుద్దీన్ లాంటి ప్రముఖ వ్యక్తి ఇలా చేసి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు లాంటి రిపోర్ట్స్ ఏవి లభించలేదు.

కాకపోతే ‘ముహమ్మద్ అజారుద్దీన్’ పేరు గల ఉత్తర్‌ప్రదేశ్‌కు రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల కాశీలో మతం మార్చుకున్నట్టు రిపోర్ట్ చేసిన పలు వార్త కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం చందౌలీ జిల్లాలోని బిచియా గ్రామానికి చెందిన ‘ముహమ్మద్ అజారుద్దీన్’ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి వేద మంత్రాలు సాక్షిగా తన ఇస్లాం మతాన్ని వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించాడు. సనాతన ధర్మాన్ని స్వీకరించిన అనంతరం తన పేరును ‘ముహమ్మద్ అజారుద్దీన్’ నుండి ‘W Singh’కి మార్చుకున్నాడు.

ఇదే వార్తను రిపోర్ట్ చేసిన మరొక కథనం ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఉత్తర్‌ప్రదేశ్‌కు వ్యక్తి మతం మారడాన్ని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మతం మారినట్టు తప్పుగా అర్ధం చేసుకొని ఉంటారని స్పష్టమవుతుంది.

చివరగా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి మతం మారిన వార్తను తప్పుగా అర్ధం చేసుకొని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మతం మారినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll