‘నాకు స్ఫూర్తి జగన్ అంటూ సాక్షి మీడియా లో వచ్చే న్యూస్ నిజం కాదు.. రాజకీయాల్లో ఎవరి స్ఫూర్తి లేదు.. నాకు నేను గా రాజకీయాల్లోకి వచ్చాను’ అని రజినీకాంత్ ఒక ట్వీట్ చేసాడని, అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ అంటూ సోషల్ మీడియాలో ఒకటి చలామణి అవుతోంది. రజినీకాంత్ నిజంగా ఆ ట్వీట్ చేశాడా లేదో చూద్దాం.
క్లెయిమ్: ‘నాకు స్ఫూర్తి జగన్ అంటూ సాక్షి మీడియా లో వచ్చే న్యూస్ నిజం కాదు..’ అని రజినీకాంత్ ట్వీట్ చేసాడు.
ఫాక్ట్ (నిజం): స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్ రజినీకాంత్ చేయలేదు. దానిని ఆయన పేరిట ‘డిజిటల్’ గా రూపొందించి సర్క్యూలేట్ చేస్తున్నారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
రాజకీయంగా రజినీకాంత్ కి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ స్ఫూర్తి అని ‘9 ఫిబ్రవరి 2020’ న ‘సాక్షి’ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ కోసం రజినీకాంత్ ట్విట్టర్ ఖాతా లో వెతికినప్పుడు, అలాంటి ట్వీట్ ఏమీ లభించలేదు. అంతేకాదు, ఆయన ఈ మధ్య కాలం లో తన చివరి ట్వీట్ ‘29 జనవరి 2020’ న చేసినట్లుగా చూడవొచ్చు .
స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ని ట్విట్టర్ లోని వేరే ట్వీట్ తో పోల్చినప్పుడు, అందులో లైన్ అలైన్మెంట్ తేడాలు కనిపిస్తాయి. అదే ట్వీట్ లో కూడా టెక్స్ట్ అలైన్మెంట్ మరియు ఫాంట్ తేడాలు చాలా ఉన్నాయి. అంతేకాదు, ‘Like’, ‘Comment’ మరియు ‘Share’ బటన్స్ ఫేస్బుక్ లో ఉంటాయి.కానీ, పోస్ట్ చేసిన ఫోటోలో ట్వీట్ కింద ఉంటాయి. కావున, స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ‘డిజిటల్’ గా రూపొందించబడినది.
చివరగా, ‘నాకు స్ఫూర్తి జగన్ అంటూ సాక్షి మీడియా లో వచ్చే న్యూస్ నిజం కాదు..’ అని రజినీకాంత్ ట్వీట్ చేయలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?