Fake News, Telugu
 

కేసీఆర్‌ను ఉద్దేశించి రజినీకాంత్ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు

0

“కేసీఆర్‌ను ఓడించడానికి 10 మంది ఒక్కటయ్యారంటే బలవంతుడు ఎవరో మీకే అర్థమవుతుంది, అలాంటి నాయకుడే తెలంగాణకు కావలసింది”, అని రజినీకాంత్ అన్నట్టు ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: “కేసీఆర్‌ను ఓడించడానికి 10 మంది ఒక్కటయ్యారంటే బలవంతుడు ఎవరో మీకే అర్థమవుతుంది, అలాంటి నాయకుడే తెలంగాణకు కావలసింది”, అని రజినీకాంత్ అన్నారు.

ఫాక్ట్: రజినీకాంత్ కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ రజినీకాంత్ నిజంగానే కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తెలుగు, తమిళ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కానీ మాకు దీనికి సంబంధించి ఎటువంటి వార్తాకథనాలు లభించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా రజినీకాంత్ కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గాని మాకు లభించలేదు.

ఒకవేళ రజినీకాంత్ నిజంగానే కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే మీడియా (ముఖ్యంగా తెలుగు మీడియా) కచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేది. కానీ, ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. పైగా రజినీకాంత్ ఇలా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసాడని చెప్తూ తమిళ వార్తా సంస్థలు కూడా ఎలాంటి కథనాలు ప్రచురించలేదు. అలాగే రజినీకాంత్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో (క్కడ మరియు ఇక్కడ) కూడా ఎటువంటి పోస్టులు లేవు.

రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ఇంతకముందే రజినీకాంత్ తెలిపారు, ‘రజినీ మక్కల్ మండ్ర’ను రద్దు కూడా చేసారు.

చివరగా, “కేసీఆర్‌ను ఓడించడానికి 10 మంది ఒక్కటయ్యారంటే బలవంతుడు ఎవరో మీకే అర్థమవుతుంది” అంటూ రజినీకాంత్ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll