Fake News, Telugu
 

రాజస్థాన్ కాంగ్రెస్ సభలో దేశ ప్రజలను భారత మాతగా వర్ణిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత మాత’ గురించి ప్రసంగం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ,“బీజేపీ వాళ్ళు భారత్ మాతాకీ జై అంటారు, ఆవిడ ఎవరో ఏంటో ఎక్కడ ఉంటారో నాకైతే తెలియదు” అని అన్నారని షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్:  రాహుల్ గాంధీ, భారత మాత గురించి సభలో ప్రసంగిస్తూ, “బీజేపీ వాళ్ళు భారత్ మాతాకీ జై అంటారు, ఆవిడ ఎవరో ఏంటో ఎక్కడ ఉంటారో నాకైతే తెలియదు” అని అన్నారు

ఫాక్ట్(నిజం): ఈ సమావేశం రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో జరిగింది. ప్రజలను ప్రశ్నిస్తూ, రాహుల్ గాంధీ, “ప్రతి ఒక్కరూ భారత్ మాతా కీ జై అనే నినాదాన్ని పలుకుతారు, అయితే భారత్ మాత ఎవరు, అంటే ఏమిటి? అని అన్న తర్వాత ప్రసంగం కొనసాగిస్తూ, రాహుల్ గాంధీ, “భారత మాత అంటే దేశ ప్రజలు, మీరందరూ, మీ సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు, దేశంలోని పేద ప్రజలు. దేశంలో దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియకపోతే ‘భారత మాతా కీ జై’ నినాదానికి అర్థమేమిటని నేను పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాను. దేశంలో విప్లవాత్మకమైన పని జరగాలి – ‘కుల గణన’ నిర్వహించాలి” అని మాట్లాడారు. దేశ ప్రజలను భారత మాతగా వర్ణించారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియోను బీజేపీ తమ X లో పోస్టు చెయ్యడం గమనించాం. ఈ పోస్టు కింద, కామెంట్స్ రూపంలో ఈ సభ రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుందని తెలిసింది. అంతే కాకుండా, పలు న్యూస్ రిపోర్ట్స్ కూడా ఈ సభ రాజస్థాన్ రాష్ట్రంలో గల బుంది నగరంలో జరిగింది అని తెలిపాయి (ఇక్కడ మరియు ఇక్కడ). 

దీన్ని ఆధారంగా తీసుకొని, ఈ సభ గురించి మరింత వెతికితే,  రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీకి సంబంధించిన వీడియో 19 నవంబర్ 2023న కాంగ్రెస్ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది అని గమనించాం. అయితే, ఈ సమావేశం రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో జరిగింది. ప్రజలను ప్రశ్నిస్తూ, రాహుల్ గాంధీ, “ప్రతి ఒక్కరూ భారత్ మాతా కీ జై అనే నినాదాన్నిపలుకుతారు, అయితే భారత్ మాత ఎవరు, అంటే ఏమిటి? అని అన్న తర్వాత ప్రసంగం కొనసాగిస్తూ, “భారతమాత అంటే దేశ ప్రజలు, మీరందరూ, మీ సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు, దేశంలోని పేద ప్రజలు. దేశంలో దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియకపోతే ‘భారత్ మాతా కీ జై’ నినాదానికి అర్థమేమిటని నేను పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాను. దేశంలో విప్లవాత్మకమైన పని జరగాలి – ‘కుల గణన’ నిర్వహించాలి” అని మాట్లాడారు. వైరల్ వీడియో ఈ ప్రసంగం నుండి ట్రిమ్ చేయబడింది. 

చివరిగా, రాజస్థాన్ కాంగ్రెస్ సభలో దేశ ప్రజలను భారత మాతగా వర్ణిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు 

Share.

About Author

Comments are closed.

scroll