Fake News, Telugu
 

కాంగ్రెస్ ముస్లింల కోసం పుట్టింది అంటూ రాహుల్ గాంధీ ఎటువంటి ట్వీట్ చేయలేదు

0

కాంగ్రెస్ ముస్లింల కోసం పుట్టిన పార్టీ అని, భారత దేశం మీద ఎక్కువ హక్కులు ముస్లింలకే ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటివల ట్వీట్ పెట్టినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ ముస్లింల కోసం పుట్టింది అంటూ రాహుల్ గాంధీ ఇటీవల ట్వీట్ చేసారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. కాంగ్రెస్ ముస్లింల కోసం పుట్టింది అంటూ రాహుల్ గాంధీ ఎటువంటి ట్వీట్ చేయలేదు. 2018లో జరిగిన ఒక మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ, ముస్లింలకు సంబంధించిన పార్టీ అని రాహుల్ గాంధీ పేర్కొన్నట్టు, ‘Inquilab’ అనే న్యూస్ సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అయితే, ‘Inquilab’ న్యూస్ సంస్థ రిపోర్ట్ చేసిన ఈ సమాచారం తప్పని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ట్వీట్ కోసం రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ హేండిల్ లో వెతికితే, కాంగ్రెస్ ముస్లింల కోసం పుట్టింది అంటూ రాహుల్ గాంధీ ఎటువంటి ట్వీట్ పెట్టలేదని తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటోలో, రాహుల్ గాంధీ ట్విట్టర్ హేండిల్ పై వేరిఫైడ్ సింబల్ లేకపోవడాన్ని మనం గమనించవచ్చు.

2018లో జరిగిన ఒక ముస్లిం కమ్యూనిటీ మీటింగ్ లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముస్లింలకు సంబంధించిన పార్టీ అని పేర్కొన్నట్టు ‘Inquilab’ అనే ఉర్దూ వార్త పత్రిక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ‘Inquilab’ పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్ ని బీజేపీ నాయకులు చాలా మంది తమ ట్విట్టర్ హేండిల్స్ లో షేర్ చేసారు. ఆ ట్వీట్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అయతే, ‘Inquilab’ వార్త పత్రిక రిపోర్ట్ చేసిన సమాచారం తప్పని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ‘Inquilab’ పేర్కొన్న మీటింగ్ లో రాహుల్ గాంధీ, దేశంలోని అన్ని మతాల లాగే ముస్లిం మత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తామని తెలిపినట్టు ‘Scroll.in’ న్యూస్ వెబ్సైటు రిపోర్ట్ చేసింది. అంతేకాదు, ఆ ముస్లిం కమ్యూనిటీ మీటింగ్ కి  హజరైన పలువురు ప్రముఖులు కూడా ‘Inquilab’ ఉర్దూ వార్త పత్రిక ప్రచురించిన ఆర్టికల్ తప్పని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సంబంధించిన పార్టీ అని రాహుల్ గాంధీ ఆ మీటింగ్ లో పేర్కొనలేదని వారు స్పష్టం చేసారు. దీనికి సంబంధించి NDTV న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు. అంతే కాదు, అయన ఆలా అన్నట్టు ఎటువంటి వీడియో ఆధారం గానీ, ఆడియో ఆధారం గానీ లేవు.

తన పై వస్తున్న ఈ వివాదాస్పద వార్తల గురించి స్పందిస్తూ, రాహుల్ గాంధీ 17 జూలై 2018 నాడు ఒక ట్వీట్ పెట్టారు. కాంగ్రెస్, దేశంలోని అన్ని మతాలకి  సంబంధించిన పార్టీ అని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో స్పష్టం చేసారు. ఈ వివరాల ఆధారంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మతానికి సంబంధించిన పార్టీ అని పేర్కొనలేదని చెప్పవచ్చు.

చివరగా, కాంగ్రెస్ ముస్లింల కోసం పుట్టింది అంటూ రాహుల్ గాంధీ ఎటువంటి ట్వీట్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll