Fake News, Telugu
 

పుంగనూరు ఆవు రోజుకి 100 లీటర్ల పాలు ఇవ్వదు

0

పుంగనూరు జాతి ఆవు రోజుకి 100 లీటర్ల పాలు ఇస్తుందని, ఆ ఆవు ఖరీదు 12 కోట్లు రుపాయలంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. అంతేకాదు, ఈ పుంగనూరు ఆవు పాలతో మాత్రమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పుంగనూరు జాతి ఆవు రోజుకి 100 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ పుంగనూరు ఆవు పాలతో మాత్రమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు.

ఫాక్ట్ (నిజం): చిత్తూరు జిల్లాకు చెందిన ఈ పుంగనూరు జాతి ఆవు, సగటున రోజుకి మూడు నుండి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. అంతరించిపోతున్న ఈ పుంగనూరు జాతి ఆవులకు ప్రస్తుతం సుమారు మూడు నుండి అయిదు లక్షల ధర పలుకుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన కోసం పుంగనూరు ఆవు పాలతో సహా ఇతర జాతి ఆవు పాలని కూడా ఉపయోగిస్తామని అధికారులు స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలుపుతున్న పుంగనూరు ఆవుకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్‌లో వెతికితే, పుంగనూరు ఆవు అనేది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు ప్రాంతానికి చెందిన ఒక మరగుజ్జు జాతి పశువని తెలిసింది. పుంగనూరు ఆవులు 70 నుండి 90 సెంటిమీటర్ల ఎత్తు, 115 నుండి  200 కేజీల బరువుతో మామూలు ఆవు దూడల సైజులో పొట్టిగా ఉంటాయి. ఈ ఆవులు సగటుగా రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల పాలు ఇస్తాయని పలు వెబ్సైటులలో తెలిపారు.

ఈ పుంగనూరు జాతి ఆవులకు ప్రస్తుతం సుమారు మూడు నుండి అయిదు లక్షల ధర పలుకుతుందని తేలిసింది. పుంగనూరు ఆవులని కొందరు పెంపుడు పశువులుగా కూడా పెంచుకుంటున్నారని తెలిసింది. పుంగనూరు ఆవుల పాలతో తయారు చేసిన నెయ్యిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన కోసం చాలా సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారని ‘The Hindu’ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం పుంగనూరు ఆవులను సాకుతుందని ఆర్టికల్‌లో తెలిపారు. క్రాస్-బ్రీడింగ్ కారణంగా అంతరించిపోతున్న పుంగనూరు ఆవుల జాతిని సంరక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కింద ఉన్న శ్రీ వెంకేశ్వర గోసంరక్షణశాల ట్రస్ట్ అడుగులు వేస్తున్నట్టు DT Next’ వార్తా సంస్థ 2017లో ఆర్టికల్ పబ్లిష్ చేసింది.  

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన కోసం కేవలం పుంగనూరు ఆవుల పాలు మాత్రమే ఉపయోగిస్తారని అని ‘ఇండియా టుడే ఫాక్ట్-చెకింగ్ టీం తిరుమల తిరుపతి దేవస్థానన్ని సంప్రదిస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన కోసం పుంగనూరు ఆవు పాలతో సహా ఇతర జాతి ఆవు పాలని కూడా ఉపయోగిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేసారు.

ఈ వివరాల ఆధారంగా పుంగనూరు ఆవు రోజుకి 100 లీటర్ల పాలు ఇవ్వదని, కేవలం, పుంగనూరు ఆవుల పాలతో మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామికి అర్చన చెయ్యరని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll