‘రోడ్ల మీద నమాజ్ నిషేధిస్తే పార్కులలో యోగాని కూడా నిషేధించాలి’ అని ప్రియాంక గాంధీ అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: ‘రోడ్ల మీద నమాజ్ నిషేధిస్తే పార్కులలో యోగాని కూడా నిషేధించాలి’ – ప్రియాంక గాంధీ.
ఫాక్ట్ (నిజం): ప్రియాంకా గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒక వేళ ఆమె నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు. పైగా ఈ వార్త గత సంవత్సరం నుండే సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే హర్యానాలోని గురుగ్రామ్‌లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు (నమాజ్) చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తని తిరిగి షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
గత కొన్ని రోజులుగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు (నమాజ్) చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ముస్లింలు చేస్తున్న నమాజ్‌ని అడ్డుకుంటూ తమ నిరసన తెలియజేస్తున్నారు (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ నేపథ్యంలోనే పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు ప్రియాంకా గాంధీ అన్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఐతే ప్రియాంకా గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒక వేళ ప్రియాంకా గాంధీ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు. అలాగే ప్రియాంకా గాంధీ సోషల్ మీడియా అకౌంట్లలో (ఇక్కడ మరియు ఇక్కడ) కూడా ఇలాంటి పోస్టూలేవీ కూడా మాకు కనిపించలేదు.
ఈ వ్యాఖ్యలు ప్రియాంకా గాంధీకి ఆపాదిస్తూ చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు షేర్ అవుతున్నాయి. ఇదే వార్త 2020లో కూడా షేర్ అయినప్పుడు FACTLY ఆ వార్తని ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
చివరగా, పార్కులలో యోగాని నిషేధించాలని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించలేదు.