‘5 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి పోలియో ఇవ్వొద్దు..దాంట్లొ వైరస్ కలిసిందంటా..పోలియోని తయారు చేసిన ఆ కంపెని యజమానిని అరెస్ట్ చేసారు..దయచేసి అందరికి చెప్పగలరు.. ‘ అంటూ సోషల్ మీడియా లో నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఇవి కేవలం వదంతులా లేక అందులో ఏమయినా నిజం ఉందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : పోలియో వాక్సిన్ లో వైరస్ కనుగొన్నారు.
ఫాక్ట్ (నిజం): 2018లో కొన్ని పోలియో వాక్సిన్ బ్యాచుల్లో వైరస్ కొనుగొన్న విషయం నిజమే అయినా వాక్సిన్ సురక్షితంగా తీసుకోవచ్చని ప్రభుతం అప్పుడే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అదే విషయం ప్రచారం చేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో చెప్పిన విషయం గురించి వెతకగా ఇదే మెసేజ్ తో ఉన్న పోస్ట్లు 2018 అక్టోబర్ నెలలో విస్తృతంగా ప్రచారం అయ్యాయని తెలుస్తుంది. ఈ విషయం గురించి వెతకగా, 2018లో జరిగిన కొన్ని టెస్టులలో పోలియో వాక్సిన్ లో వైరస్ కనుగొన్నట్లు తెలుస్తుంది. ఈ వాక్సిన్ ‘బయో-మెడ్’ అనే సంస్థ తయారు చేసింది. ఆ సంస్థ ఎండి ని కూడా అప్పుడు అరెస్ట్ చేసారు.
అప్పుడు వైరల్ అయిన మెసేజ్ చూసి బయపడొద్దని, పోలియో వాక్సిన్ సురక్షితంగా తీసుకోవచ్చని హెల్త్ మినిస్ట్రీ వారు ట్వీట్ చేసారు.
#Polio vaccines are safe and effective https://t.co/5u0sPLZcRa pic.twitter.com/Zm18HEpRfr
— Ministry of Health (@MoHFW_INDIA) October 4, 2018
#Polio vaccines are absolutely safe & essential for every child’s well-being. Vaccines have saved millions of children from debilitating effects of polio since decades & will continue to do so. Parents must get their children vaccinated against polio#StayPolioFree #SwasthaBharat pic.twitter.com/hftpVLWa5V
— Ministry of Health (@MoHFW_INDIA) October 5, 2018
పోలియో వాక్సిన్ లో వైరస్ ఉందని వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కూడా 2018 లో నోటీస్ రిలీజ్ చేశారు.
చివరగా, 2018లో పోలియో వాక్సిన్ లో వైరస్ ఉందని వైరల్ అయిన వదంతుల్ని ఇప్పుడు మళ్ళి సోషల్ మీడియా లో ప్రచారం చేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పోస్టులో చెప్పినట్టు పోలియో వాక్సిన్ లో ఎలాంటి వైరస్ లేదు, పోలియో వాక్సిన్ సురక్షితమే.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: సోషల్ మీడియా లో వదంతులని నమ్మకండి. పోలియో వాక్సిన్ సురక్షితమే - Fact Checking Tools | Factbase.us