Fake News, Telugu
 

ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలని లేబుల్ చేయడం కోసం గూగుల్ ఎర్త్ సంస్థ ఎటువంటి ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించట్లేదు

0

గూగుల్ ఎర్త్ మ్యాప్స్ లో ఇజ్రాయిల్ లేదా పాలస్తీనా దేశాల పేర్లని లేబుల్ చేయడం కోసం గూగుల్ సంస్థ తమ వెబ్సైటులో ఆన్లైన్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. పోస్టులో తెలిపిన ‘israel-vs-palestine.com’ వెబ్సైటు లింక్ ఓపెన్ చేసి ఇజ్రాయిల్ దేశానికి మద్దతుగా వోటు వేయాలని ఈ పోస్టులో కోరుతున్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాల మధ్య ఇటీవల ఘర్షణల చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గూగుల్ ఎర్త్ మ్యాప్స్ లో ఇజ్రాయిల్ లేదా పాలస్తీనా దేశాల పేర్లని లేబుల్ చేయడం కోసం గూగుల్ సంస్థ తమ వెబ్సైటులో ఆన్లైన్ పోల్ నిర్వహిస్తోంది.

ఫాక్ట్ (నిజం): గూగుల్ ఎర్త్ లో ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా దేశాలు ఇదివరకే లేబుల్ అయి ఉన్నాయి. గూగుల్ ఎర్త్ సంస్థ తమ మ్యాప్స్ లో అంతర్జాతీయ ప్రదేశాలని లేబుల్ చేయడం కోసం ఇప్పటివరకు ఎటువంటి ఆన్లైన్ పోలింగ్ నిర్వహించలేదు. ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాల మధ్య ఆన్లైన్ ఓటింగ్ నిర్వహిస్తున్న ఈ ‘israel-vs-palestine.com’ వెబ్సైటు, 2008 లో స్థాపించబడిన ఒక స్వతంత్ర వెబ్సైటు అని తెలిసింది. ఈ వెబ్సైటుతో గూగుల్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఆన్లైన్ పోలింగ్ వివరాల కోసం గూగుల్ లో వెతికితే, గూగుల్ ఎర్త్ మ్యాప్స్ అటువంటి ఆన్లైన్ పోలింగ్ ఏది నిర్వహించలేదని తెలిసింది. గూగుల్ ఎర్త్ లోని మ్యాప్స్ లో ఇజ్రాయిల్ మరియు పాలస్తీనాలు ఇదివరకే గుర్తించి లేబుల్ అయి ఉన్నట్టు తెలిసింది. గూగుల్ ఎర్త్ మ్యాప్స్ లో లేబుల్ అయి ఉన్న ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా దేశాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అంతర్జాతీయ ప్రదేశాలని గుర్తించడం కోసం గూగుల్ ఎర్త్ సంస్థ ఇప్పటివరకు ఎటువంటి ఆన్లైన్ పోల్ నిర్వహించలేదని తెలిసింది.

అమెరికా, వివాదాస్పద పాలస్తీనా ప్రదేశాన్ని ఒక ప్రత్యేక రాష్రంగా మాత్రమే పరిగణించడంతో, గూగుల్ మ్యాప్స్ పాలస్తీనా రాష్ట్రాన్ని తమ మ్యాప్స్ లో లేబుల్ చేయలేదు. దీనికి సంబంధించి ‘The Guardian’ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. గూగుల్ ఎర్త్ లోని మ్యాప్స్ లో మాత్రం పాలస్తీనా ప్రదేశాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తూ లేబుల్ చేసారు.

ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాల మధ్య పోల్ నిర్వహిస్తున్న ఈ ‘israel-vs-palestine.com’ వెబ్సైటు వివరాల కోసం గూగుల్ లో వెతికితే, ఈ వెబ్సైటుకి సంబంధించిన పూర్తి వివరాలు ‘Whois’ వెబ్సైటులో లభించాయి. ‘israel-vs-palestine.com’ అనే వెబ్సైటుని 28 డిసెంబర్ 2008 నాడు రిజిస్టర్ చేసుకున్నట్టు ‘Whois’ వెబ్సైటులో తెలిపారు. ఈ వెబ్సైటు యజమానులు ఎవరనేది ఎక్కడా తెలుపలేదు. పోస్టులో తెలిపిన ఈ ‘israel-vs-palestine.com’ వెబ్సైటుతో గూగుల్ కి ఎటువంటి సంబంధం లేదు.

2014లో ‘israel-vs-palestine.com’ వెబ్సైటు నిర్వహిస్తున్న ఈ ఆన్లైన్ పోల్ ని గూగుల్ ఎర్త్ మ్యాప్స్ తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ‘Snopes’ న్యూస్ సంస్థ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఆన్లైన్ పోల్ ని గూగుల్ ఎర్త్ మ్యాప్స్ నిర్వహించట్లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలని లేబుల్ చేయడం కోసం గూగుల్ ఎర్త్ మ్యాప్స్ ఎటువంటి ఆన్లైన్ పోలింగ్ నిర్వహించట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll