Fake News, Telugu
 

మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం వల్ల ప్రజల సొమ్ము 797 కోట్లు నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

0

‘మన్ కి బాత్ సొల్లు వల్ల ప్రజల సొమ్ము ఎంత బొక్కో ఒకసారి చూద్దాం’ అని చెప్తూ ఆ కార్యక్రమం యొక్క లాభ నష్టాల గురించి విశ్లేషిస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టుని బట్టి, ఒక్కో ఎపిసోడుకి అయ్యే ఖర్చు 8.3 కోట్లు అని, ఇప్పటివరకు అయిన 100 ఎపిసోడ్ల ఖర్చు 830 కోట్లు అని చెప్తున్నారు. ఇదిలా ఉంచితే, ఈ కార్యక్రమం కేవలం 33.16 కోట్ల లాభాల్ని రాబట్టింది అని, దీనికి ఒక RTI రిప్లైని పోస్టులో ఆధారంగా పెట్టారు. వైరల్ పోస్టులో క్లెయిముని బట్టి మొత్తం నష్టం సుమారు 797 కోట్లు. అసలు ఈ క్లెయిములోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ప్రధాని మోది గారి మన్ కి బాత్ రేడియో కార్యక్రమం వల్ల 797 కోట్ల ప్రజల సొమ్ము పోయింది.

ఫాక్ట్(నిజం):Ministry of Information and Broadcasting మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్య సభలో ఇచ్చిన ఒక సమాధానం ప్రకారం, 2014 నుండి 2021 వరకు మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల సుమారు 30 కోట్ల ఆదాయం సమకూరింది.  RTI activist వివేక్ పాండేకి RTI ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం 2022 అక్టోబర్ వరకు ఈ ఆదాయం సుమారు 33కోట్లు. ఇదిలా ఉండగా, మన్ కీ బాత్ ఒక్కో ఎపిసోడుకి అయ్యే ఖర్చు 8.3 కోట్లు కాదని, అది ఇప్పటివరకు ఆ కార్యక్రమం యొక్క యాడ్స్ కోసం అయిన ఖర్చు అని PIB FactCheck తమ ట్విట్టర్ ద్వారా పేర్కొనింది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చెప్తున్నట్లు మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల ఇప్పటివరకు వచ్చిన ఆదాయం సుమారు 33కోట్లు అయినా, ఒక్క ఎపిసోడ్‌కి అయ్యే ఖర్చు 8.3 కోట్లు కాదు అని మా పరిశోధనలో తెలిసింది.

ముందుగా, మన్ కీ బాత్ వల్ల సమకూరిన ఆదాయం గురించి చూద్దాం. పోస్టులో ఉన్న RTI డాక్యుమెంట్ ఫోటోను ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇది వివేక్ పాండే అనే వ్యక్తి చేసిన ఒక ట్వీట్‌కి దారి తీసింది. ఇందులో ఉన్న సమాచారం  ప్రకారం, మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల అక్టోబర్ 2022 వరకు సమకూరిన ఆదాయం 33.16 కోట్లు.

2014 నుండి 2021 వరకు ఈ కార్యక్రమం యొక్క ఆదాయం సుమారు 30 కోట్లు అని Ministry of Information and Broadcasting మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్య సభలో ఇచ్చిన ఒక సమాధానం ద్వారా తెలియపరిచారు. ఇదే విషయాన్ని గురించి 2021లో వార్త కథనాలు కూడా ప్రచురితమయ్యాయి (ఇక్కడ మరియు ఇక్కడ ). 

అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన సమాధానంలోని ఆదాయ లెక్కలు వివేక్‌ అనే వ్యక్తికీ RTI ద్వారా ఇచ్చిన సమాధానంలో 2021 వరకు ఉన్న వాటితో చాలా వరకు సరిపోతున్నాయి. దీని బట్టి పోస్టులో చెప్తున్నట్లు మన్ కీ బాత్ యొక్క ఆదాయం 33.16 కోట్ల అని నిర్ధారించుకోవచ్చు.

2021 జులైలో అనురాగ్ ఠాకూర్ రాజ్య సభలో ఇచ్చిన ఆదాయాల లెక్కలు.

అక్టోబర్ 2022 వరకు వచ్చిన ఆదాయం ( RTI సమాధానం )

కానీ, ఒక్కో ఎపిసోడ్‌కి 8.3 కోట్లు ఖర్చు అవుతున్నాయి అనే క్లెయిమ్ సరైనది కాదు అని PIB FactCheck తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క యాడ్స్ కొరకు ఇప్పటివరకు పెట్టిన ఖర్చు అని PIB FactCheck తెలిపింది. అంటే, పోస్టులో చెప్తున్నట్లు 100 ఎపిసోడ్లకు అయిన ఖర్చు 830 కోట్లు కాదు, అలాగే ఈ కార్యక్రమం వల్ల కలిగిన నష్టం 797 కోట్లు కాదు.

చివరిగా, మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం వల్ల ప్రజల సొమ్ము 797 కోట్లు పోయాయి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll