Fake News, Telugu
 

ఈ ఫోటోలో మోదీ నివాళులు అర్పిస్తున్నది దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి, గాడ్సే విగ్రహానికి కాదు

0

ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ విగ్రహానికి అలాగే, గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు, అంటూ కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.  ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ మరియు నాథూరామ్ గాడ్సే విగ్రహాలకు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో కుడివైపు ఫోటోలలో కనిపిస్తున్నది భారతీయ జన సంఘ్ (ప్రస్తుత భారతీయ జనతా పార్టి) స్థాపకుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహం, నాథూరామ్ గాడ్సే విగ్రహం కాదు. 2017లో బీజేపీ స్థాపన దివస్ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోదీ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రాహానికి నివాళులు అర్పిస్తున్నప్పుడు ఈ ఫోటోని తీసారు.  ప్రధాని నరేంద్ర మోదీ  దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రాహాలకి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలని పలు వార్తా సంస్థలు పబ్లిష్ చేసాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. `

పోస్టులో కుడివైపు ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ఆల్ ఇండియా రేడియో వార్తా సంస్థ 06 ఏప్రిల్ 2017 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. 2017లో బీజేపీ స్థాపన దివస్ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోదీ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రాహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు. ఈ ఫోటోని ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ట్విట్టర్ హండిల్‌లో కూడా షేర్ చేసారు. 

ఈ ఫోటోని షేర్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2017 ఏప్రిల్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  బీజేపీ 37వ స్థాపన దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జన సంఘ్ (ప్రస్తుత భారతీయ జనతా పార్టీ) స్థాపకుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి నివాళులర్పించారని ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేసారు. ఈ దృశ్యాలు కలిగిన వీడియోలని కూడా పలు న్యూస్ ఛానల్స్‌లో పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

30 జనవరి 2022 నాడు మహాత్మాగాంధీ వర్ధంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ని సందర్శించి మహాత్మాగాంధీ సమాధికి నివాళులులర్పించారు. అయితే, మహాత్మాగాంధీ వర్ధంతి రోజున హిందూ మహాసభ లాంటి సంస్థలు నాథూరామ్ గాడ్సేకు నివాళులు అర్పించినట్టు కొన్ని న్యూస్ వెబ్సైట్లు రిపోర్ట్ చేసాయి. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ నాథూరామ్ గాడ్సేకు నివాళులు అర్పించారని ఎక్కడా రిపోర్ట్ అవలేదు.

చివరగా, ప్రధాని నరేంద్ర మోదీ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యాలని మోదీ నాథూరామ్ గాడ్సే విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll