‘పశ్చిమ బెంగాల్‌లో జాతీయజెండాకి బదులు మమతా పార్టీ జెండా ఎగురవేసిన TMC పార్టీ నాయకులంటూ’ TMC జెండాను ఎగరేస్తున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో TMC పార్టీ నాయకులు గణతంత్ర దినోత్సవం నాడు జాతీయజెండాకి బదులు మమతా TMC పార్టీ జెండా ఎగురవేసిన వీడియో.
ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలో TMC పార్టీ జెండా ఎగురవేస్తూ కనిపించేది రఘునాథపుర్ మాజీ టీఎంసీ ఎంఎల్ఎ పూర్ణచంద్ర బౌరి. ఐతే వీడియోలో టీఎంసీ జెండా ఎగరేసే కన్నా ముందు అతను జాతీయ జెండా ఎగరేసాడు. ఆ తర్వాత జాతీయ జెండా పక్కనున్న టీఎంసీ జెండా ఎగరేసాడు. ఐతే కేవలం టీఎంసీ జెండాను ఎగరేసిన వీడియో మాత్రమే షేర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్ర బౌరి జాతీయ జెండా ఎగరేసిన ఫోటోలు రఘునాథపుర్ టీఎంసీ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసారు. అదేవిధంగా పూర్ణచంద్ర బౌరి జాతీయ జెండా ఎగరేస్తున్న వీడియోని తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోలో TMC పార్టీ జెండా ఎగురవేస్తూ కనిపించేది రఘునాథపుర్ మాజీ టీఎంసీ ఎంఎల్ఎ పూర్ణచంద్ర బౌరి. ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు ఆయన జాతీయ జెండాకి బదలు టీఎంసీ జెండా ఎగరేయలేదు. టీఎంసీ జెండా ఎగురవేసే కన్నా ముందు అయన జాతీయ జెండాని ఎగరవేసాడు. ఈ వీడియోని మొదట బెంగాల్ బీజేపి నేత సువేందు అధికారి షేర్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పూర్ణచంద్ర బౌరి గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురవేసిన సంధర్బానికి సంబంధించిన ఫోటోలు రఘునాథపుర్ టీఎంసీ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసారు. ఈ వీడియో మరియు వైరల్ అయిన వీడియోలో పూర్ణచంద్ర బౌరి వేసుకున్న దుస్తులు, చుట్టుపక్కల ప్రదేశాలు, వ్యక్తులు మొదలైన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, దీన్నిబట్టి వైరల్ వీడియో మరియు ఈ వీడియో రెండు ఒకే సందర్భంలో తీసినవని అర్ధమవుతుంది.

ఐతే ఈ ఫోటోలలో టీఎంసీ జెండా పక్కకు, దానికంటే ఎత్తులో జాతీయ జెండా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలలో పూర్ణచంద్ర బౌరి టీఎంసీ జెండా కన్నా ముందు జాతీయ జెండా ఎగరేసినట్టు కూడా స్పష్టంగా అర్ధమవుతుంది.
పూర్ణచంద్ర బౌరి టీఎంసీ జెండా ఎగరేసిన వీడియో తప్పుడు క్లెయిమ్ తో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, గణతంత్ర దినోత్సవం నాడు తను జాతీయ జెండా ఎగరవేసిన వీడియోని తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసాడు. వైరల్ వీడియోకి సంబంధించిన నిజాన్ని లోకల్ బెంగాలీ మీడియా రిపోర్ట్ చేసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

వీటన్నిటిబట్టి పూర్ణచంద్ర బౌరి జాతీయ జెండా ఎగరవేసిన క్లిప్ కాకుండా కేవలం టీఎంసీ జెండాను ఎగరవేసిన క్లిప్‌ని మాత్రమే షేర్ చేస్తునట్టు అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, బెంగాల్‌లో టీఎంసీ నాయకులు గణతంత్ర దినోత్సవం నాడు టీఎంసీ జెండా కన్నా ముందు జాతీయ జెండాను ఎగరవేశారు