Fake News, Telugu
 

బెంగాల్‌లో నమాజ్ సమయాలలో హిందూ దేవాలయాలు మైకులు పెట్టరాదని మమతా బెనర్జీ ఉత్తర్వులు జారీ చేయలేదు

0

బెంగాల్‌లో నమాజ్ చేసే సమయాలలో హిందూ దేవాలయాలు మైకులు పెట్టరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర్వులు జారీ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టుని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బెంగాల్‌లో నమాజ్ సమయాలలో హిందూ దేవాలయాలు మైకులు పెట్టరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫాక్ట్ (నిజం): నమాజ్ సమయాలలో హిందూ దేవాలయాలు మైకులు పెట్టరాదని ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ విషయాన్ని గురుంచి ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వెబ్సైటులో వెతికితే, నమాజ్ సమయాలలో హిందూ దేవాలయాలు మైకులు పెట్టవద్దని ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిసింది. 

హిందూ దేవాలయాలు నమాజ్ సమయాలలో మైకులు పెట్టవద్దని హెచ్చరిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఎటువంటి ట్వీట్ చేయలేదు. ఒకవేళ మమతా బెనర్జీ అలాంటి ఉత్తర్వులు జారీ చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కానీ, ఈ సమాచారాన్ని తెలుపుతూ ఇంటర్నెట్లో ఎటువంటి సమాచారం లేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పని కచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బెంగాల్‌లో నమాజ్ చేసే సమయాలలో హిందూ దేవాలయాలు మైకులు పెట్టరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll