Fact Check, Fake News, Telugu
 

‘కోకా కోలా’ డ్రింక్స్ మానేసి పళ్ళ రసాలు తాగమని చెప్పే ఈ మెసేజ్ లోని సందేశాన్ని మోదీ ఇవ్వలేదు

0

పెప్సీ మరియు కోకా కోలా డ్రింక్స్ ని తాగడం మానేసి భారత రైతులు పండించే పళ్ళ యొక్క తాజా రసాలను తాగమని, అలా చేయడం వల్ల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళకుండా మరియు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపవచ్చని భారతదేశ ప్రజలకి ప్రధాని నరేంద్ర మోదీ సందేశం ఇచ్చాడని చెప్తూ ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  పెప్సీ మరియు కోకా కోలా డ్రింక్స్ ని తాగడం మానేసి భారత రైతులు పండించే పళ్ళ యొక్క తాజా రసాలను తాగమని భారతదేశ ప్రజలకి సందేశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని సందేశాన్ని ప్రధాని మోదీ ఇచ్చినట్టు ఎక్కడా సమాచారం లేదు. కాకపోతే, భారత రైతులను కాపాడటానికి మాత్రం పెప్సీ, కోకా కోలా మరియు ఇతర కంపెనీలు వారు తయారు చేసే ఫ్రూట్ డ్రింక్స్ లో కనీసం ఐదు శాతం అసలైన పళ్ళ రసాలను కలపమని 2014 లో ప్రధాని మోదీ కోరారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని సందేశాన్ని ప్రధాని మోదీ ఇచ్చారా అని ఇంటర్నెట్ లో వెతకగా, ఆ సందేశాన్ని మోదీ ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే ప్రధాని ఆ వ్యాఖ్యలు చేస్తే, ప్రముఖ వార్తాసంస్థలు అన్నీ ప్రచురించేవి. కానీ, ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావన లేదు. కాకపోతే, భారత రైతులను కాపాడటానికి మాత్రం పెప్సీ, కోకా కోలా మరియు ఇతర కంపెనీలను వారు తయరు చేసే ఫ్రూట్ డ్రింక్స్ లో కనీసం ఐదు శాతం అసలైన పళ్ళ రసాలను కలపమని 2014 లో ప్రధాని మోదీ కోరాడు. అదే విషయాన్నీ ప్రధాని పలు సార్లు ప్రస్తావించడం ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ వారు 2016 లో కంపెనీలు తాయారు చేసే ఫ్రూట్ డ్రింక్స్ లో కనీసం 10 శాతం ఫ్రూట్ కంటెంట్ (లెమన్ డ్రింక్ లో కనీసం ఐదు శాతం) ఉండాలని రూల్ తీసుకువచ్చినట్టు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, కోకా కోలా డ్రింక్స్ మానేసి పళ్ళ రసాలు తాగమని చెప్తూ మెసేజ్ లోని సందేశాన్ని మోదీ ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll